- 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌పైరైడ్ చేసే అవకాశం
- న్యూ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, న్యూ స్టీరింగ్ వీల్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లభ్యం
మహీంద్రా థార్ త్వరలోనే ఇండియన్ మార్కెట్ లో 5-డోర్ వెర్షన్‌లోరాబోతుంది, మరింత కొత్త రూపంలో, నిర్థారణ తర్వాత నుండి, లైఫ్‌స్టైల్ ఎస్‌యువి యొక్క పొడుగు వెర్షన్ టెస్ట్ మ్యూల్ తో కనిపిస్తూ మరియు లాంచ్ టైమ్‌లైన్ వివరాలతో ప్రతిసారి వార్తల్లో కనిపిస్తుంది.
సరికొత్తస్పై పిక్చర్‌తో, 5-డోర్ మహీంద్రా థార్ లో చాలా వరకు ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ వివరాలు లీక్ అయ్యాయి. దీని బయటి భాగంలో, ఇది కొత్త గ్రిల్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాప్స్, న్యూ బ్రాండ్ లోగో, ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, ఎల్ఈడీ టైల్‌లైట్స్ మరియు న్యూ 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా, ఎస్‌యువి, 5-డోర్ అప్‌డేట్‌తో సింగిల్ పేన్ ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సన్‌రూఫ్‌ను కూడా కలిగి ఉంటుంది.
దీని లోపలి భాగంలో, మహీంద్రా 5-డోర్ థార్ ఒకే విధమైన కంట్రోల్ తో న్యూ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పొందుతుంది. ఫీచర్ పరంగా చెప్పాలంటే, ఇది ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, న్యూ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్స్ కలిగి ఉంటుంది.
మెకానికల్ గా, ఈ థార్ యొక్క 5-డోర్ వెర్షన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 6-స్పీడ్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో జతచేయబడుతుందని అంచనా వేస్తున్నాము.
అనువాదించిన వారు: రాజపుష్ప