- అక్టోబరు 31, 2024లోపు కేవైసీని తప్పనిసరి చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
- టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడమే లక్ష్యంగా రూల్స్ లో మార్పులు
2024ఆగస్టు 1వ తేదీ నుంచి టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ని ఉపయోగించే రూల్స్ మారాయి. మీరు టోల్ ప్లాజా వద్ద ఎదురయ్యే ఇబ్బందులు ఇకపై నుంచి వద్దనుకుంటే, మీ ఫాస్టాగ్ అకౌంట్లో అవసరమైన మార్పులు చేయడం మర్చిపోవద్దు. మీరు కొత్త నిబంధనలను పాటించకపోతే, మీ ఫాస్టాగ్ కూడా బ్లాక్ లిస్టులోకి వెళ్లిపోవచ్చు.
ఫాస్టాగ్ వ్యాలిడిటీ మరియు కేవైసీ
ఆగస్టు నెల నుంచి 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఉపయోస్తున్న ఫాస్టాగ్ అకౌంట్స్ ఇకపై నుంచి చెల్లవు. కాబట్టి, మీ ఫాస్టాగ్ గడువు ముగిసిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ గడువు ముగుస్తున్నట్లయితే, వెంటనే కొత్త ఫాస్టాగ్ అకౌంట్ ని తీసుకోండి.
3 సంవత్సరాల కంటే పాత ఫాస్టాగ్ ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే, అక్టోబర్ 31, 2024లోపు కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కేవైసీ చేయకపోతే, మీ ఫాస్టాగ్ అకౌంట్ బ్లాక్ లిస్టులోకి వెళ్లిపోవచ్చు.
వెహికిల్ మరియు మొబైల్ నంబర్ లింక్
ఇప్పుడు వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్ మరియు యజమాని ఫోన్ నంబర్‌కు ఫాస్టాగ్ లింక్ చేయబడాలి. మీరు మీ వెహికిల్ ముందు మరియు వెనుక భాగం ఫోటోగ్రాఫ్‌లను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో లేదా ఆ తర్వాత కొత్త వెహికిల్ కొనుగోలు చేసే వారు 3 నెలల్లోగా రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్
ఫాస్టాగ్‌కు సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) కొత్త గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది. ఇప్పుడు విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ను అతికించకుండా ఉంటే, వెహికిల్ ఓనర్ టోల్ మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి మరియు ఇతర వ్యక్తులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
రూల్స్ లో మార్పులకు కారణం
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, టోల్ రుసుము చెల్లించడానికి పట్టే సమయాన్ని తగ్గించడమే ఈ నిబంధనలను మార్చడానికి కారణం. కొత్త రూల్స్ ద్వారా, టోల్ ప్లాజాల వద్ద చాలా ఈజీగా సులభంగా అయిపోతుంది కాబట్టి, మీ జర్నీ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్