- అక్టోబర్ మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం
- డీలర్‌షిప్‍ల వద్ద ప్రారంభమైన బుకింగ్స్
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన అధికారిక డీలర్‌షిప్స్ వద్ద రాబోయే ఎస్‌యూవీ డ్యూయో టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్ అనధికారిక ఆర్డర్స్ ను అంగీకరించడం ప్రారంభించాయి. ఆసక్తి గల కస్టమర్‌లు ఆయా ఎస్‌యూవీలను రూ. 25,000మరియు రూ.21,000 వరకు టోకెన్ అమౌంట్ మొత్తం చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
సఫారీ మరియు హారియర్ ఫేస్‌లిఫ్ట్స్ టెస్ట్ మ్యూల్స్ తో భారతదేశం అంతటా టెస్ట్ రన్స్ చేస్తూ అనేక సందర్భాలలో కనిపించడం జరిగింది. డిజైన్ పరంగా, రెండు ఎస్‌యూవీలు అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రివైజ్డ్ గ్రిల్, కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి లైట్ బార్, రివైజ్డ్ టైల్‌లైట్స్ మరియు రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌ను పొందే అవకాశం ఉంది..
అప్‌డేటెడ్ సఫారి మరియు హారియర్ ఇంటీరియర్స్ చూస్తే కర్వ్ కాన్సెప్ట్ మరియు ఇటీవల ప్రారంభించిన నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ నుండి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. 2023 అప్‌డేట్ తర్వాత, రెండు ఎస్‌యూవీలు ఇప్పటికే 360-డిగ్రీల సరౌండ్ కెమెరా, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఏడిఏఎస్ టెక్‌తో సహా ఫీచర్ లిస్టులో ఉన్నాయి. అంతేకాకుండా, మోడల్స్ క్యాబిన్‌ల ఇల్యూమినేటెడ్ లోగోతో కూడిన న్యూ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, నావిగేషన్ సపోర్ట్‌తో కూడిన ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, టచ్-బేస్డ్ హెచ్ విఏసి కంట్రోల్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ప్రీమియం సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్స్ ఉంటాయని మేము అనుకుంటున్నాము.
మెకానికల్‍గా, ఫేస్‌లిఫ్టెడ్ ఎస్‌యూవీలు సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో లిస్ట్ చేయబడ్డాయి. అలాగే ఇది 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్ ద్వారా పవర్ ని పొందుతుంది. అదే విధంగా ఇదిన్యూ టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్ లో కూడా వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప