- మొదట ఆగస్ట్ 7న ఈవీ వెర్షన్ లాంచ్ తర్వాత ఐసీఈ కర్వ్ లాంచ్
- 55-56kWh బ్యాటరీ ప్యాక్ ని పొందే అవకాశం
టాటా మోటార్స్ ఆగష్టు 7, 2024న ఇండియాలో కర్వ్ కూపే ఎస్‌యువిని లాంచ్ చేయనుంది. మాకు అందిన సమాచారం ప్రకారం మొదట ఈవీ ఇటరేషన్ ని లాంచ్ అయిన తర్వాత రెండు నెలల్లోపే ఐసీఈ వెర్షన్ కూడా లాంచ్ చేయబడుతుంది. ప్రస్తుతం, లాంచ్ కి ముందుగాఇండియా అంతటా సెలెక్ట్ చేసిన టాటా-అధికారిక డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్లు టోకెన్ మొత్తం రూ. 21,000 చెల్లించి అనధికారికంగా కర్వ్ ఈవీని బుక్ చేసుకోవచ్చు.
మా సమాచారం ప్రకారం, టాటా కర్వ్ ఈవీ 55-56kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం. డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే, దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 550కిమీల వరకు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. అదే విధంగా, ఇది ఒకేఛార్జింగ్ సైకిల్‌లో 430-450కిమీల రియల్ వరల్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. ఈ సంఖ్యల ప్రకారం, కర్వ్ ఈవీ అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ద్వారా ఫ్లాగ్‌షిప్ ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ గా మారుతుందని మరియు బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో అత్యధిక రేంజ్ తో వస్తుందని చెప్పవచ్చు.
అంతేకాకుండా, త్వరలో కర్వ్ ఈవీ ఆగస్ట్ మొదటి వారంలోలాంచ్ కానున్నందున ఈ నెలాఖరు నాటికి డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమవుతుంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే, కర్వ్ ఈవీ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త టూ-స్పోక్ తో ఫ్రీ-స్టాండింగ్ 12.5-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో ప్యాక్ చేయబడి, స్పోక్ స్టీరింగ్ వీల్, రీజెన్ మోడ్స్ కోసం ప్యాడిల్ షిఫ్టర్స్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి ఫీచర్లతో రానుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప