- పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ మరియు మరిన్ని ఫీచర్లను అందిస్తున్న టాటా
- ఇప్పటికే నిర్వహించబడిన బిఎన్ క్యాప్ మరియు జిఎన్ క్యాప్ టెస్టింగ్
టాటా మోటార్స్ దాని న్యూ-జెన్ కూపే ఎస్‌యువి, ఐసీఈ మరియు ఈవీ మోడళ్లలో కర్వ్ ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈవీ ఇటరేషన్ ఆగష్టు 7 న ఇండియన్ మార్కెట్లోకి రానుంది, అలాగే, దీని తర్వాత ఐసీఈ వెర్షన్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇప్పుడు, మేము పెట్రోల్ కర్వ్ రియల్ వరల్డ్ ఫోటోలను వెల్లడించిన తర్వాత, అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ ఈవీలో నిర్ధారించబడిన ఫీచర్ లిస్ట్కి సంబంధించి ప్రత్యేక వివరాలను కలిగి ఉన్నాము.
ముందుగా డాష్‌బోర్డ్ తో ప్రారంభిస్తే, కర్వ్ ఈవీ నెక్సాన్, సఫారి మరియు హారియర్ ల మాదిరిగానే లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే, కర్వ్ ఈవీ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో 12-ఇంచ్ హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆర్కేడ్.ఈవీ మరియు 15+ ఓటిటి యాప్‌ల సపోర్ట్, జెబిఎల్-సోర్స్డ్ 9 స్పీకర్స్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, లెథెరెట్ అప్హోల్స్టరీ, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను పొందుతుంది.
సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కర్వ్ ఈవీ 6 ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్స్, ఐఅర్ఎ 2.0 కనెక్ట్ చేయబడిన టెక్ మరియు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్ కి అలసటగా ఉన్నా మరియు నిద్ర వస్తున్నట్లు అనిపించినా ఆ సమయంలో అలర్ట్ గా ఉంచే ఫీచర్ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మాకు అందిన సమాచారం ప్రకారం, టాటా కర్వ్ ఈవీ ఇప్పటికే అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీ రేటింగ్స్ కోసం బిఎన్ క్యాప్ టెస్టింగ్ ద్వారా 5 స్టార్ స్కోర్ చేసిందని కూడా నిర్ధారించబడింది.
టాటా కర్వ్ ధర రూ. 18 లక్షలు నుంచి రూ. 24 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు ఉండవచ్చని అంచనా. లాంచ్ తర్వాత, టాటా నుండి వస్తున్న మొదటి ఆల్-ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యువి కర్వ్ ఎంజి ZS ఈవీ, మహీంద్రా XUV400, బివైడి అటో 3 మరియు అప్ కమింగ్ (రాబోయే) హ్యుందాయ్ క్రెటా ఈవీలకు పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప