- ఇండియాలో ఆగస్టు 7న కర్వ్ ఈవీ ధరలు వెల్లడి
- ఈవీ వెర్షన్ తో పాటుగా లాంచ్ కాబోతున్న ఐసీఈ వెర్షన్
టాటా మోటార్స్ ఆగస్టు 7వ తేదీన కర్వ్ రేంజ్ ధరలను ప్రకటిస్తూ, కర్వ్ మోడల్ ని లాంచ్ చేయనుంది. అయితే, దాని కంటే ముందుగా కర్వ్ కారు దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. వీటికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలను మేము కలిగి ఉండగా, ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాము.
ఫోటోలలో చూసిన విధంగా, కొత్త కర్వ్ ఈవీ కారు వర్చువల్ సిగ్నేచర్ సన్ రైజ్ కలర్ ఫినిషింగ్ ని పొందింది. కూపే ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ హైలైట్లలో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, కారు ముందు మరియు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్, కారు ఫేసియా ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-టోన్ వీల్స్, స్లోపింగ్ రూఫ్ లైన్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఫోటోలలో మొదటిసారిగా 2024 కర్వ్ ఈవీ ఇంటీరియర్ లుక్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో గుర్తించదగిన ఫీచర్లలో డ్యాష్ బోర్డుపై ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఫినిషింగ్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ఫోర్-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్, ఏసీ బటన్లను ఆపరేట్ చేయడానికి టచ్ కంట్రోల్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటివి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది నెక్సాన్ నుంచి తీసుకున్న సెంటర్ కన్సోల్ తో వస్తుండగా, ఇందులో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ మరియు మోడ్స్, పార్సిల్ ట్రే, డ్యూయల్-టోన్ థీమ్, కొత్త తాళాలు, పవర్డ్ టెయిల్ గేట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్ లెస్ ఛార్జర్, మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ వంటివి ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుండగా, అందులోని 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ మోటార్ తో జతచేయబడి ఉండనుంది. అలాగే, డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించే బ్యాటరీతో కర్వ్ ఈవీ రాబోతుంది. ఇంకా, ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్