- మూడు వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్లలో అందించబడనున్న ఆల్ట్రోజ్ రేసర్
- 7 జూన్, 2024న ధరల టాటా ఆల్ట్రోజ్ రేసర్ ప్రకటన
టాటా మోటార్స్ త్వరలోనే ఆల్ట్రోజ్ రేసర్ ని ఇండియాలో లాంచ్ చేయనుంది. 7 జూన్, 2024న టాటా ఆల్ట్రోజ్ రేసర్ ధరలను ప్రకటించనుండగా, దాని కంటే ముందుగా ఈ పెర్ఫార్మెన్స్ హ్యచ్ బ్యాక్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఇక్కడ కనిపిస్తున్న కలర్ ని బట్టి చూస్తే, ఇది డ్యూయల్-టోన్ అవెన్యూ వైట్ కలర్ లో ఉంది. అంతే కాకుండా, ఆల్ట్రోజ్ రేసర్ ని అటామిక్ ఆరెంజ్ మరియు ప్యూర్ గ్రే అనే మరో రెండు కలర్లలో పొందవచ్చు. వేరియంట్ల పరంగా చూస్తే, కస్టమర్లు ఈ మోడల్ ని R1, R2, మరియు R3 అనే మూడు వేరియంట్లలో బుక్ చేసుకోవచ్చు.
ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే, ఆల్ట్రోజ్ రేసర్ రెడ్ మరియు వైట్ యాక్సెంట్స్ తో ఆల్-బ్లాక్ థీమ్ కలర్ తో రానుంది. ఫీచర్ల పరంగా, ఈ మోడల్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఎయిర్ ప్యూరిఫైయర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌రూఫ్ వంటి బెస్ట్ ఫీచర్లతో రానుంది.
బానెట్ కింద, ఆల్ట్రోజ్ రేసర్ 1.2-లీటర్ 3-సిలిండర్, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది. ఈ మోటార్ 118bhp మరియు 170Nm టార్కును ఉత్పత్తి చేయనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్