- 2025 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశం
- కాస్మటిక్ అప్ డేట్స్ మరియు మెరుగైన ఫీచర్లతో వస్తున్న కుషాక్ ఫేస్‍లిఫ్ట్
చెక్ ఆటోమొబైల్ బ్రాండ్ స్కోడా ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కుషాక్ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ని టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. స్పై ఫోటోలలో చూస్తే, ఈ మోడల్ లో ఎక్కడైతే ఎక్కువ ఫీచర్లు మరియు హైలైట్ అంశాలు కనబడతాయో అలాంటి కారు ముందు మరియు వెనుక భాగాల్లో భారీ కామోఫ్లేజ్ తో కప్పబడి కనిపించింది
ముందుగా ఫేసియాతో ప్రారంభిస్తే, కొత్త స్కోడా కుషాక్ ఫేస్‍లిఫ్ట్ లో రానున్న అతి ముఖ్యమైన అప్ డేట్ ఏంటి అంటే, ఈ కారు అదనంగా ఎడాస్ (ఏడీఏఎస్) అప్ డేట్ తో వస్తున్నట్లు ఎయిర్ డ్యాంపై ఒక సెన్సార్ చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇంకా ఇది కొత్త గ్రిల్, ట్వీక్ చేయబడిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, మరియు రీవర్క్డ్ టెయిల్ గేట్ వంటి డిజైన్ హైలైట్లతో వస్తుందని భావిస్తున్నాం. అలాగే, ఇది కొత్త ఫ్రెష్ అల్లాయ్ వీల్స్ సెట్ తో అందించబడే అవకాశం ఉంది.
ఇంటీరియర్ పరంగా, రీఫ్రెష్డ్ స్కోడా కుషాక్ కారు లోపల అప్హోల్స్టరీ మరియు వెంటిలేటెడ్ సీట్లు మరియు ఇతర అప్ డేట్లతో వస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుతం విక్రయించబడుతున్న కుషాక్ మోడల్ లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, మరియు 10-ఇంచ్ టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
పవర్ ట్రెయిన్ ఆప్షన్ల పరంగా, కుషాక్ ఫేస్‍లిఫ్ట్ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న మోడల్ లాగే అవే పవర్ ట్రెయిన్లతో వచ్చే అవకాశం ఉంది. అందులోని 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిఎస్‍జి యూనిట్లతో జతచేయబడి వచ్చాయి. ముఖ్యంగా, 1.5-టిఎస్ఐ వెర్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ నిలిపివేయబడగా, ఇది ఫేస్‍లిఫ్టెడ్ అవతార్ కారులో మనం చూడవచ్చు. హ్యుందాయ్ క్రెటాతో పోటీపడుతున్న ఈ అప్ డేటెడ్ ఇటరేషన్ 2025 ద్వితీయార్థంలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్