- 6 కలర్ ఆప్షన్స్, 11 వేరియంట్స్ లో అందుబాటులోకి
- నెక్సాన్ ఇవితో పాటు లాంచ్ అవ్వనున్న నెక్సాన్ ఫేస్ లిఫ్ట్
టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఇండియాలో సెప్టెంబర్ 14, 2023న లాంచ్ కానుంది. అధికారికంగా ధరలను ప్రకటించక ముందే సబ్-4మీటర్ ఎస్‍యువి వెయిటింగ్ పీరియడ్ వివరాలను మేము కలిగి ఉన్నాము.
అప్ డేటెడ్ నెక్సాన్ ఐసీఈ మరియు ఇవి వెర్షన్స్ దేశంలో ఉన్న టాటా డీలర్స్ వద్దకు చేరుకుంటున్నాయి. మాకు తెలిసిన వివరాల ప్రకారం, ఈ మోడల్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ సమయం కనీసం 6 నుంచి 8 వారాల వరకు లేదా 2 నెలల వరకు ఉండవచ్చని సమాచారం. నెక్సాన్ మరియు నెక్సాన్ ఇవి రెండింటికి సంబంధించిన వెయిటింగ్ సమయం స్టాండర్డ్ గా ఉండనుంది.
2023 నెక్సాన్ 11 వేరియంట్స్ లో రానుంది. అవేవి అంటే, స్మార్ట్, స్మార్ట్+, స్మార్ట్+ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+ఎస్, ఫియర్ లెస్, ఫియర్ లెస్+, ఫియర్ లెస్+ఎస్. ఫీచర్స్ పరంగా చూస్తే, టాప్ స్పెసిఫికేషన్ వేరియంట్ లో 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, నావిగేషన్ సపోర్ట్ కోసం డిజిటల్ డ్రైవర్స్ ఇన్ బిల్ట్ డిస్ ప్లే, టచ్ బేస్డ్ హెచ్ వి ఏ సి కంట్రోల్స్, ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ పై ప్రకాశవంతంగా మెరిసే టాటా లోగో, వైర్ లెస్ చార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. అదే విధంగా 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, యాంబియంట్ లైటింగ్, కొత్త గేర్ లీవర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, రేర్ వైపర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
మెకానికల్ గా, ఇది వరకు ఉన్న వాటిలాగే పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ ఇందులో కూడా ఉండనున్నాయి. మొత్తానికి పెట్రోల్ మోటార్ తో నడిచే ఎస్‍యువి 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ఆప్షన్ తో రానుంది.
ఇంజిన్ | ట్రాన్స్మిషన్ |
1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ | 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, 7-స్పీడ్ డీసీటీ యూనిట్. |
1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ | 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటీ యూనిట్. |
అనువాదించిన వారు : సంజయ్ కుమార్