- ఈ వారం చివరలో లాంచ్ కానున్న హెక్టర్ బ్లాక్ స్టార్మ్
- ఇతర బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ల లానే అప్‍డేట్స్ పొందిన ఈ మోడల్
తాజాగా ఎంజి మోటార్ ఇండియా దాని సోషల్ మీడియా ఛానెల్స్ లో మరికొన్ని రోజుల్లో లాంచ్ కానున్న మోడల్ టీజర్ ని షేర్ చేసింది. ఇప్పుడు మేము ఈ వెర్షన్ కి సంబంధించి పూర్తి వివరాలను కలిగి ఉన్నాము, ఆ వెర్షన్ పేరు ఏంటో తెలుసా! అదేనండి, హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్.
ఎక్స్‌టీరియర్ మరియు డిజైన్
ఆస్టర్ మరియు గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లాగానే, ఎంజి హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ కూడా ఎక్స్‌క్లూజివ్ గా బ్లాక్ పెయింట్ థీమ్ లో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది డార్క్ క్రోమ్ గ్రిల్, పియానో బ్లాక్ రూఫ్ రెయిల్స్ మరియు హెడ్‌ల్యాంప్ బెజెల్స్, స్మోక్డ్ టెయిల్‌లైట్స్, రెడ్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ ఫెండర్‌పై ‘బ్లాక్‌స్టార్మ్’ లోగో వంటి వాటికి కూడా పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఫ్రంట్ బంపర్ పై మరియు ఓఆర్‌విఎంలపై రెడ్ యాక్సెంట్స్ ఉండగా, మరియు ఇవి కారుకు ఇరుప్రక్కలా మరియు కారు వెనుక ప్రొఫైల్ వరకు పొడిగించబడి ఉన్నాయి.
ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లు
ఫీచర్ల పరంగా, 2024హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్ మరియు 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని అందుకోనుంది. ఇక ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, ఈ వెర్షన్ రెడ్ యాంబియంట్ లైటింగ్, రెడ్ యాక్సెంట్స్, బ్లాక్ ఇంటీరియర్ థీమ్, మరియు కారు చుట్టూ అంతటా రెడ్ కలర్డ్ ఇన్సర్ట్స్ తో వచ్చే అవకాశం ఉంది.
పవర్ ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్
కొత్త హెక్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్లోని పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కస్టమర్లు దీనిని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ల నుంచి ఎంచుకోవచ్చు. అదే విధంగా ఈ వెర్షన్ ని హెక్టర్ ప్లస్ రేంజ్ లో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. హెక్టర్ బ్లాక్ స్టార్మ్ లాంచ్ అయిన తర్వాత, కియా సెల్టోస్ X-లైన్, హ్యుందాయ్ క్రెటా N లైన్, మరియు టాటా హారియర్ డార్క్ ఎడిషన్ తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్