- సెలెక్ట్ వేరియంట్లపై తగ్గిన ధరలు వర్తింపు
- ఈఎస్పీతో అప్ డేట్ చేయబడిన రెండు మోడల్స్ రేంజ్ లోని అన్ని వేరియంట్లు
మారుతి సుజుకి దాని ప్రొడక్టు రేంజ్ లో ఉన్న రెండు మోడల్స్ ధరలను తగ్గించింది. ఆల్టో K10 మరియు మారుతి ఎస్-ప్రెస్సో అనే రెండు మోడల్స్ ని దేశవ్యాప్తంగా ఎరీనా రేంజ్ లో ఉన్నడీలర్ షిప్స్ ద్వారా బ్రాండ్ విక్రయిస్తుంది.
మారుతి ఎస్-ప్రెస్సో మోడల్ పై రూ.2,000 ధర తగ్గగా, తగ్గిన ధరలు ఎక్స్క్లూజివ్ గా ఎస్-ప్రెస్సో మోడల్ లోని LXi పెట్రోల్ వేరియంట్ పై వర్తిస్తాయి. అదే విధంగా, ఇప్పుడు ఆల్టో K10 కారుపై రూ.6,500 ధర తగ్గడంతో, ఈ కారు మరింత చవకగా లభిస్తుంది. గమనించాల్సిన అంశం ఏంటి అంటే, తగ్గిన ధరలు VXi పెట్రోల్ వేరియంట్ పై మాత్రమే వర్తిస్తాయి.
గత నెలలో, ఆల్టో K10 మరియు మారుతి ఎస్-ప్రెస్సో కార్లలోని అన్ని వేరియంట్లలో మారుతి సుజుకి కంపెనీ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ఈఎస్పీ)ని జోడించి ఈ కార్లను మరింత మెరుగుపరిచింది. దీంతో, సేఫ్టీ పరంగా కూడా ఈ కార్లు ఇప్పుడు చాలా మెరుగయ్యాయి. ఈ రెండు కార్లతో పాటుగా, సెలెరియో కారు కూడా డ్రీమ్ సిరీస్ ని పొందగా, వీటిని రూ.4.99 లక్షల ఎక్స్-షోరూం ప్రత్యేక ధరతో పొందవచ్చు. కొత్తగా వచ్చిన ఆల్టో K10, మారుతి ఎస్-ప్రెస్సో మరియు సెలెరియో కార్లలోని డ్రీమ్ సిరీస్ ఎడిషన్లలో అందించబడిన ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు మా కార్ వాలే వెబ్ సైటులో అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్