- ఇండియాలో రూ.8.93 లక్షలతో ప్రారంభమైన కొత్త ఫ్రాంక్స్ వేరియంట్ల ధరలు
- అదనపు సేఫ్టీ ఫీచర్లను పొందిన మారుతి ఫ్రాంక్స్
మారుతి సుజుకి ఇండియాలో ఫ్రాంక్స్ రేంజ్ లో రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేయగా, వీటి ధరలు రూ. 8.93 లక్షలతో ప్రారంభమయ్యాయి. ఈ కొత్త వేరియంట్లు డెల్టా+ వేరియంట్ పైన పొజిషన్ చేయబడగా, ఈ రెండు కొత్త వేరియంట్లు అద్బుతమైన అదనపు బెస్ట్ సేఫ్టీ ఫీచర్లను పొందాయి.
డెల్టా+ వేరియంట్ తో పోలిస్తే, మారుతి ఫ్రాంక్స్ డెల్టా+(O)వేరియంట్ సైడ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ని పొందింది. దీనికి అదనంగా, ఇందులో స్పేర్ వీల్ తొలగించబడగా, దాని స్ధానంలో టైర్ రిపేర్ కిట్ ని స్టాండర్డ్ గా మారుతి అందించింది. డెల్టా+ వేరియంట్లతో పోలిస్తే, కొత్త ఫ్రాంక్స్ డెల్టా+(O)వేరియంట్ ధర రూ.15,500 ఎక్కువగా ఉంది.
ఇంకా చెప్పాలంటే, ఈ ఫ్రాంక్స్ కారు సిగ్మా, డెల్టా, డెల్టా+, డెల్టా+(O), జీటా, మరియు ఆల్ఫా అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కస్టమర్లు ఈ కారును 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, లేదా సిఎన్జి కిట్ తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనే మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఫ్రాంక్స్ డెల్టా+ వేరియంట్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:
వేరియంట్ | ధర (ఎక్స్-షోరూం) |
ఫ్రాంక్స్ డెల్టా+ (O) ఎంటి | రూ. 8.93 లక్షలు |
ఫ్రాంక్స్ డెల్టా+ (O) ఎజిఎస్ | రూ. 9.43 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్