- ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న ఆవిష్కరణ
- పనోరమిక్ సన్ రూఫ్, ఏడీఏఎస్(ఎడాస్), మరియు మరెన్నో ఫీచర్లు దీని సొంతం
ముందుగా చెప్పినట్లు మహీంద్రా XUV 3XO ఆవిష్కరణకు సంబంధించి 29 ఏప్రిల్, 2024 కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా సెలెక్ట్ డీలర్‌షిప్స్ రాబోయే (అప్‍కమింగ్) టాటా నెక్సాన్ కు పోటీగా ఈ మోడల్ బుకింగ్స్ అంగీకరించడం ప్రారంభించాయి. మీరు రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో సరికొత్త XUV 3XO మీ పేరు మీద బుక్ చేసుకోవచ్చు.
మొత్తంగా XUV 3XOగా పిలువబడుతున్న అప్‍డేటెడ్ మహీంద్రా XUV300 భారీ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో రానుంది. ఇక బయటివైపు మార్పుల విషయానికి వస్తే, ఎస్‍యూవీ ఒకే రకమైన డైమెన్షన్లతో ఫ్రెష్ డిజైన్ ని పొందుతుంది. ఇది ఒక సన్నని గ్రిల్, ఇన్వర్టెడ్ సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్-బ్యారెల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ట్వీక్డ్ బంపర్‌తో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండనుంది. కారు వెనుక భాగంలో, ఎల్ఈడీ టెయిల్‌లైట్ రీడిజైన్డ్ బంపర్ మరియు XUV 3XO బ్రాండింగ్‌తో పాటు టెయిల్‌గేట్‌పై ట్విన్-పీక్ మహీంద్రా లోగోతో కనెక్టెడ్ లుక్ ని పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఎస్‍యూవీ రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ని కూడా పొందనుంది.
ఇక దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇంతకు ముందే వీటి గురించి మీకు వెల్లడించిన ప్రకారం, XUV 3XOపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు లెవెల్-2ఏడీఏఎస్ (ఎడాస్)సూట్ వంటి ఫీచర్లను పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఇతర మోడల్స్ నుంచి పోటీని ఎదుర్కోవడానికి మహీంద్రా కంపెనీ ఈ కొత్త ఎక్స్‌యూవీని వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మరియు కొత్త సీట్ అప్హోల్స్టరీ వంటి బెస్ట్ ఫీచర్లతో అప్‍గ్రేడ్ చేసింది.
ఈ కొత్త XUV 3XO మోడల్ కొత్త వేరియంట్లతో పాటు మరిన్ని ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇంకా ఇతర కార్లతో పోటీ విషయానికి వస్తే, XUV 3XO మోడల్ సెగ్మెంట్‌లోని కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ తో కూడా పోటీ పడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్