- సన్ రూఫ్ తో వచ్చిన రెండు వేరియంట్లు
- పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్లలో లభ్యం
సేల్స్ ని మరింత పెంచేలా మరిన్ని ఫీచర్లను జత చేస్తూ కియా ఇండియా రెండు కొత్త వేరియంట్లను తీసుకువచ్చి దాని లైనప్ ని అప్‍డేట్ చేసింది. ఈ ఆటోమేకర్ తాజాగా కొత్త వేరియంట్లను పరిచయం చేసి కారెన్స్ మరియు సెల్టోస్ మోడల్స్ లైనప్ ని రివైజ్ చేసిన సంగతి మేము ఇదివరకే మీకు వెల్లడించాము. ఇప్పుడు, దాని ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ సోనెట్ లో జరిగిన మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను కలిగి ఉన్నాము.
కియా సోనెట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో HTE (O) మరియు HTK (O) అనే రెండు కొత్త వేరియంట్లను అందుకోనుంది. ఇందులో అతి పెద్ద హైలైట్ ఏంటి అంటే, ఈ రెండు వేరియంట్లు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ తో రానున్నాయి. దీంతో, లోయర్-ఎండ్ (తక్కువ) వేరియంట్లలో కూడా కస్టమర్లు సన్ రూఫ్ ఆప్షన్ ని పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, దీంతో పాటుగా HTK (O) వేరియంట్ కూడా ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లను పొందనుంది.
ప్రస్తుతం, కియా సోనెట్ ని మొత్తం HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, మరియు X-లైన్ అనే ఏడు వేరియంట్లలో పొందవచ్చు. బానెట్ కింద, టాటా నెక్సాన్ తో పోటీపడుతున్న ఈ మోడల్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్లతో వచ్చింది. కస్టమర్లు దీనిని 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎంటి, మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్స్ తో కాన్ఫిగర్ చేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్