- పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఏటీ వెర్షన్లలో ఒక్కో వేరియంట్‌ను పొందనున్న సెల్టోస్
- ఇటీవల అప్‌డేట్‌లను పొందిన కారెన్స్
కియా ఇండియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యువి లైనప్‌లో రెండు కొత్త వేరియంట్‌లను జోడించింది. వాటి ధరలపై ప్రత్యేకమైన వివరాలను మేము పొందాము. సెల్టోస్ ఇప్పుడు అదనంగా HTK+ పెట్రోల్ సివిటి మరియు HTK+ డీజిల్ ఏటీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఈవేరియంట్‌ల ధర వరుసగా రూ. 15.40 లక్షలుమరియు రూ.16.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) గా ఉంది.
సెల్టోస్ గతంలో పెట్రోల్ సివిటి HTX వేరియంట్‌లో, రూ. 16.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, HTK+ వేరియంట్ రావడంతో HTX వేరియంట్ ధర రూ. 1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు తగ్గింది.
అదేవిధంగా, డీజిల్ ఏటీ వెర్షన్ HTX, GTX+ (S), GTX+, X-లైన్ (S), మరియు X-లైన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, HTX వేరియంట్‌తో పోలిస్తే, సెల్టోస్ HTK+ డీజిల్ ఏటీ వేరియంట్ రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధర తక్కువగా ఉంది . ముఖ్యంగా, ఈ రెండు కొత్త వేరియంట్‌లు ఇప్పుడు వాటి సంబంధిత ఆటోమేటిక్ రేంజ్ లో ఎంట్రీ-లెవల్ ఆఫర్‌లో ఉన్నాయి.
కొత్త సెల్టోస్ HTK+ (పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఏటీ) ఫీచర్ హైలైట్‌లలో ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్‌తో కూడిన స్మార్ట్ కీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ డీఫాగర్, రియర్ వైపర్ మరియు వాషర్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ డిఆర్ఎల్ఎస్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌తో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.
HTX వేరియంట్‌లలో మిస్ అయిన ఫీచర్స్ పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఏటీ ఉన్న కియా సెల్టోస్ HTK+ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్స్ మరియు టైల్‌లైట్స్, 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను మిస్ అవుతుండగా, బ్లాక్ మరియు బీజ్ ఇంటీరియర్ థీమ్, సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్‌తో కూడిన 10.25-ఇంచ్ స్క్రీన్, ఓటిఎ అప్‌డేట్‌లు మరియు వాయిస్ రికగ్నిషన్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ప్యాడిల్ షిఫ్టర్స్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, డ్రైవ్ మోడ్స్, ట్రాక్షన్ మోడ్స్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ మరియు కప్ హోల్డర్‌లతో కూడిన వెనుక ఆర్మ్‌రెస్ట్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.
ఇతర వార్తలలో, కారెన్స్ ట్రాన్స్‌మిషన్ విభాగంలో గణనీయమైన మార్పుతో పాటు కొత్త వేరియంట్‌ల జోడింపును కూడా పొందింది, వాటి వివరాలు ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
న్యూ కియా సెల్టోస్ వేరియంట్‌ల ధరలు (ఎక్స్-షోరూమ్):
వేరియంట్స్ | ధరలు |
సెల్టోస్ HTK+ పెట్రోల్ సివిటి | రూ. 15.40 లక్షలు |
సెల్టోస్ HTK+ డీజిల్ ఏటీ | రూ. 16.90 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప