- అక్టోబర్ 3న ధరల ప్రకటన
- రూ. 10 లక్షల టోకెన్ అమౌంట్ తో అనధికారిక బుకింగ్స్ ప్రారంభం
దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన కియా డీలర్‌షిప్‌ల వద్ద అప్ కమింగ్ (రాబోయే) EV9 ఎస్‌యువి ఆర్డర్‌లను ఇప్పటి నుండే అంగీకరించడం ప్రారంభించాయి. అలాగే, ఇది 3వతేదీ అక్టోబర్, 2024న లాంచ్ కానుంది. ఈ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ మూడు-వరుసల ఎస్‌యువి 5 కలర్స్ లో ఒకే వేరియంట్‌లో అందించబడనుంది. కస్టమర్లు వారి వారి పేర్లతో సెలెక్ట్ చేసిన డీలర్‌షిప్‌ల వద్ద రూ. 10 లక్షలు టోకెన్ అమౌంట్ చెల్లించి EV9 ని రిజిస్ట్రేషన్‌ను చేసుకోవచ్చు.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత, ఎస్‌యువి డెలివరీలు తాత్కాలికంగా మార్చి 2025లో ప్రారంభమవుతాయని. కియా EV9 పూర్తి దిగుమతి అవుతుందని భావించి, ఇది సిబియు రూట్ ద్వారా ఇండియాకి చేరుకుంటుంది. దీని మొదటి దిగుమతులు వచ్చే ఏడాది మార్చిలో షెడ్యూల్ చేయబడ్డాయి.
కియా EV9 కొరియన్ ఆటోమేకర్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యువి అవుతుంది. ఇది 99.8kWh బ్యాటరీ ప్యాక్‌తో ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్‌తో ఒక్కసారి ఛార్జ్‌పై 561 కిలోమీటర్లవరకు రేంజ్ ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది 380bhp మరియు 700Nm మాక్సిమం టార్క్ అవుట్‌పుట్‌తో ఏడబ్లూడీ వెర్షన్ లో అందించబడుతుంది.
ఇక ధరల విషయానికొస్తే, EV9 ధర రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉంటుందని మేముభావిస్తున్నాం. ఈ ధరతో, EV9 ఎస్‌యువి ల్యాండ్ రోవర్ డిఫెండర్, వోల్వో XC90, ఆడి Q8, బిఎండబ్ల్యూ X5, రేంజ్ రోవర్ వెలార్, మెర్సిడెస్-బెంజ్ GLE మరియు లెక్సస్ RX లకు కూడా పోటీగా ఉంటుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప