- రెండు వేరియంట్లలో లభ్యం
- రూ.26.9 లక్షలతో ధరలు ప్రారంభం
బివైడి ఇండియా దాని కొత్త ప్రొడక్టు ఆల్-ఎలక్ట్రిక్ ఎంపివి eMax 7 ధరల వివరాలను వెల్లడించింది. ఇది ప్రీమియం మరియు సుపీరియర్ అనే రెండు వేరియంట్లలో రూ.26.9 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులోకి రాగా, దీనిని మీరు 6 మరియు 7 సీట్-లేఅవుట్లలో పొందవచ్చు.
ఇప్పుడు, బ్రాండ్ ప్రకారం, eMax 7 కారు కస్టమర్ల నుంచి అద్బుత స్పందనను పొందుతూ వారికి మరింత చేరువ అవుతుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ ఎంపివిపై దాదాపు రెండు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ తాత్కాలికం కాగా, అందుబాటులో ఉన్న స్టాక్ మరియు వెర్షన్ ని బట్టి మారే అవకాశం ఉంది.
అలాగే, దీనిపై బివైడి ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ హెడ్ రాజీవ్ చౌహాన్ స్పందిస్తూ, “ఇప్పటి వరకు eMax 7 కారు ద్వారా 1000 బుకింగ్స్ పొందాము. ఇంకా చెప్పాలంటే, 7-సీట్ లేఅవుట్లో సుపీరియర్ వేరియంట్ పై అత్యధిక డిమాండ్ కొనసాగుతుండగా, క్రిస్టల్ వైట్ మరియు హార్బర్ గ్రే వంటి కలర్లను కస్టమర్లు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కారు ద్వారా బ్రాండ్ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే, ఇండియాలో బివైడి నుంచి బెస్ట్-సెల్లర్ గా నిలిచే అవకాశం ఉంది.
బివైడి eMax 7 కారు 55.4kWh మరియు 71.8kWh బ్యాటరీ ప్యాక్ యూనిట్లతో అందుబాటులో ఉంది. ఇంకా డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, ఒక్కసారి ఫుల్ గా ఛార్జింగ్ చేస్తే మొదటి బ్యాటరీ ప్యాక్ 420 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, రెండవ బ్యాటరీ ప్యాక్ 530 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్