- ప్రస్తుతం మారుతి ఎర్టిగాపై కొనసాగుతున్న ఏడు నెలల వెయిటింగ్ పీరియడ్
- అత్యధికంగా సిఎన్‍జి వేరియంట్స్ కు పెరుగుతున్న డిమాండ్
మారుతి సుజుకి కంపెనీ తమ పాపులర్ మోడల్స్ అయిన ఎర్టిగా, బ్రెజా, స్విఫ్ట్ మరియు డిజైర్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించే పనిలో పడింది. కార్‌మేకర్ తన 7-సీట్ ఎంపివి, ఎర్టిగా వెయిటింగ్ పీరియడ్‌ను గత కొన్ని నెలల్లో ఉన్న దానికంటే దాదాపు సగానికి సగం తగ్గించినట్లు వెల్లడించింది.
ఎర్టిగా రేంజ్ గురించి చెప్పాలంటే, సిఎన్‍జి వెర్షన్స్ అత్యధిక వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే వీటిపై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలిపింది. గత మూడు సంవత్సరాలలో సెమీ కండక్టర్స్ మరియు కొన్ని ఇతర సిఎన్‍జి-సంబంధిత విడిభాగాల కొరత కారణంగా ఎక్కువగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మారుతి కంపెనీ తెలిపింది.
ఇప్పుడు మోడల్ ఉత్పత్తి మరియు పైన పేర్కొన్న విడిభాగాల సరఫరా పెరగడంతో, ఒక సంవత్సరం ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను సుమారు ఆరు నుండి ఏడు నెలలకు తగ్గించింది. ఇంకా, మారుతి మోడల్స్ లో సిఎన్‍జి వెర్షన్స్ సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్‌ను పరిష్కరించినప్పటికీ, మొత్తం ప్రొడక్ట్స్ వెయిటింగ్ టైమ్‌లైన్‌లను తగ్గించడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
ముఖ్యంగా, మారుతి ఎర్టిగా బ్రాండ్ ప్రకారం దాదాపు 1 లక్ష బుకింగ్స్ పైగానే అందుకున్నా, అందులో 93,000 యూనిట్స్ కేవలం ఎంపివికి సంబంధించిన ఆర్డర్స్ పెండింగ్లో ఉన్న విషయం ఈ సంవత్సరం ఆగస్టులో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఇంకా, అదే సమయంలో ఎర్టిగా బ్యాడ్జ్-ఇంజనీరింగ్ వెర్షన్ మరియు టయోటా రూమియన్ సిఎన్‍జికి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో, దాని ఫలితంగా ఈ మోడల్ బుకింగ్స్ నిలిచిపోయాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్