- నెక్సాన్ ఈవీ వెర్షన్లలో కంటే తక్కువలో వచ్చే అవకాశం
- అదిరిపోయేలా ఉన్న రీఫ్రెష్డ్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ లుక్
గత కొంతకాలంగా మహీంద్రా నుంచి బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా 3XO కారు కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మహీంద్రా కంపెనీ దానికి తగ్గట్టు ఎలక్ట్రిక్ కారును తీసుకురావాలని భావిస్తుంది. బ్రాండ్ ప్రస్తుతం ఓల్డ్ XUV 300 ఆధారంగా వచ్చిన XUV400 ఎలక్ట్రిక్ కారును కలిగి ఉంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రస్తుతం కొనసాగుతున్న పోటీ దృష్ట్యా XUV400 చాలా పాతది అయిపోయింది. ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ కార్లు చాలా మెరుగైన ఫీచర్లతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తున్నాయి. సహజంగానే, మహీంద్రా దీనిని గమనిస్తూ ఉంది మరియు టెక్ ఫీచర్లు మరియు ఇంజనీరింగ్ పరంగా, XUV3XO ఈవీని పోటీకి సిద్ధం చేస్తుంది.
మొదటిసారి పబ్లిక్ రోడ్లపై హల్ చల్ చేస్తున్న XUV 3XO ఎలక్ట్రిక్ కారులో మీరు ఏయే వాటిని ఇందులో ఆశిస్తున్నారో చూసేయండి. ఇది ఒక ప్రోటోటైప్ వెహికిల్ అయినా సరే, సాధారణంగా ఇందులోని చాలా ఫీచర్లు అధికారిక ఆవిష్కరణ మరియు లాంచ్ సమయంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు, దీనిని గమనిస్తే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కారులోని ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ XUV 3XO ఐసీఈ వెర్షన్ కంటే కొంచెం భిన్నంగా ఉన్నాయి. అలాగే దీని లుక్ కూడా కొంచెం భిన్నంగానే ఉంది. మహీంద్రా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో ఏరో-ఇంస్పైర్డ్ అల్లాయ్ వీల్స్ ని పరిచయం చేయనుంది. ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, ఈ కారులోని కొన్ని వేరియంట్లు కొత్త కలర్లతో రానుండగా, ఈవీ థీమ్ తో వస్తుందని భావిస్తున్నాం.
XUV3XO ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ సైజ్ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ, XUV3XO ఈవీ XUV400లో అందించాలనుకున్న బ్యాటరీ యూనిట్ తోనే రావచ్చు అని భావిస్తున్నాం. ధర మరియు కాంపీటీషన్ పరంగా, ఎలక్ట్రిక్ XUV 3XO టాటా నెక్సాన్ ఈవీలోని కొన్ని వేరియంట్లకు పోటీగా మారవచ్చు. ఫ్యూచర్ లో మహీంద్రా నుంచి వచ్చే ఈ ఎలక్ట్రిక్ XUV 3XO కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, అలాగే ఇతర కార్ల వివరాలు తెలుసుకోవాలంటే, నిరంతరం మా వెబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి.
మూలం: పవర్ స్ట్రోక్ పిఎస్