- ఇండియాలో రూ.3.99 లక్షలు నుండి ప్రారంభంకానున్న ఆల్టో ధరలు
- దేశంలో ఈ బ్రాండ్ నుంచి ఎంట్రీ లెవెల్ లో లభించే మోడల్ ఇదే
ఎరీనా మరియు నెక్సా చైన్లో ఉన్న సెలెక్టెడ్ మారుతి సుజుకి డీలర్షిప్స్ అక్టోబర్ 2023లో ఆయా మోడల్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి.
మారుతి నుంచి లభిస్తున్న అత్యంత చవకైన మోడల్ ఆల్టో, ప్రస్తుతం ఆల్టో దాని పెట్రోల్ వేరియంట్స్ పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తుంది. అదే సమయంలో, సిఎన్జి వేరియంట్స్ పై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందజేస్తూ డిస్కౌంట్స్ ను పరిమితం చేసింది.
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో, ఆల్టో బ్రాండ్ 45 లక్షల యూనిట్స్ సేల్స్ తో సరికొత్త మైల్ స్టోన్ ని అధిగమించింది. దీనిని ఒరిజినల్ గా 2000 సంవత్సరంలో పరిచయం చేయగా, ఈ మోడల్ ప్రస్తుతం కె10 వెర్షన్ లోనే కాకుండా, 800 వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. అయితే తాజాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 800 వెర్షన్ ను ఆర్థిక కారణాల రీత్యా మారుతి నిలిపివేసింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్