ఇంతకు ముందు వరకు, భారతీయ కార్ల కంపెనీలు సేఫ్టీ రేటింగ్స్ కోసం యూరోపియన్ గ్లోబల్ ఎన్ క్యాప్ పై ఆధారపడవలసి వచ్చేది. ఇక నుంచి ఇండియాలో విక్రయించే కార్లకు క్రాష్ టెస్ట్‌లను భారత్ ఎన్ క్యాప్ నిర్వహించనుంది. ఇటీవల, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గ్లోబల్ ఎన్ క్యాప్ తరహాలో భారత్ ఎన్ క్యాప్ అంటే ఇండియా న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఈ ఏడాది అక్టోబరులో దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించారు. ఈ ఆర్టికల్‌లో మేము మీకు ఇండియా ఎన్ క్యాప్ మరియు గ్లోబల్ ఎన్ క్యాప్ గురించి, వీటి మధ్య ఉన్న తేడాల గురించి చెప్పబోతున్నాం.
అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తర్వాత కార్ క్రాష్ టెస్టులు నిర్వహిస్తున్న 5వ దేశంగా ఇండియా నిలిచింది. దీని కారణంగా ఇప్పుడు కస్టమర్లు దేశంలో అందుబాటులో ఉన్న వాహనాల ఆప్షన్స్ నుండి తమకు నచ్చిన దానిని, మెరుగైన ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉంది.
సేఫ్టీ రేటింగ్స్ లో తేడాలు ఏమున్నాయి ?
వాహనానికి గ్లోబల్ ఎన్ క్యాప్ ద్వారా అడల్ట్ ఆక్యుపెన్సీకి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందాలంటే, దీనికి కనీసం 34 పాయింట్లు కావాలి, ఇందులో ఫ్రంట్ క్రాష్ టెస్ట్‌కు 16 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ కోసం 16 పాయింట్లు మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ కోసం 2 పాయింట్లు ఉంటాయి.
భారత్ ఎన్ క్యాప్ లో ఒక వాహనం 5 స్టార్ రేటింగ్ పొందాలంటే, అడల్ట్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం కనీసం 27 పాయింట్లు మరియు చైల్డ్ సేఫ్టీ కోసం కనీసం 41 పాయింట్లు అవసరం ఉంటుంది.
క్రాష్ టెస్ట్
భారత్ ఎన్ క్యాప్ క్రింద క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్ నియమాలను గ్లోబల్ ఎన్ క్యాప్ ని పోలి ఉంటాయి. కారును క్రాష్ టెస్ట్ చేస్తున్నప్పుడు మూడు రకాల టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో ఫ్రంటల్ ఆఫ్‌సెట్ బారియర్ టెస్టును గంటకు 64 కిలోమీటర్ల వేగంతో నిర్వహిస్తారు. దీని ద్వారా, డ్రైవర్ మరియు ప్రయాణీకుల తల, మెడ, ఛాతీ, తొడ మరియు మోకాళ్ల సేఫ్టీ కోసం నిర్వహిస్తారు. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం, కారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బారియర్ కారుతో ఢీకొంటుంది, దీని కారణంగా ప్రయాణీకుడికి గాయం అంచనా వేయబడుతుంది. పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం, కారు గంటకు 26 కిమీ వేగంతో ఉండాలి మరియు ఈ టెస్టులో పాస్ అవ్వాలంటే, కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలి.
గ్లోబల్ ఎన్ క్యాప్ కంటే మరింత స్ట్రాంగ్ గా ఉండనున్న భారత్ ఎన్ క్యాప్
భారత్ ఎన్ క్యాప్ వల్ల ఆర్థికంగా కూడా ఇండియాకు చాలా బెనిఫిట్స్ లభించనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, 'భారత్‌లో నిర్వహించే కార్ క్రాష్ టెస్ట్ ధర గ్లోబల్ ఎన్ క్యాప్ తో పోలిస్తే నాలుగో వంతు ఉంటుంది. 'గ్లోబల్ ఎన్ క్యాప్ కింద క్రాష్ టెస్ట్ ధర రూ. 2.5 కోట్లు, అయితే భారత్ ఎన్ క్యాప్ కింద కేవలం రూ. 60 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది.'
భారత కార్ల విక్రయాలు, ఎగుమతులు పెరిగే అవకాశం
భారత్ ఎన్ క్యాప్ అందుబాటులోకి రావడంతో, మేడ్ ఇన్ ఇండియా వాహనాల అమ్మకాలు మరియు ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. అలాగే, దీని ద్వారాభారతీయ కారు కొనుగోలుదారులు సేఫ్టీ కారును ఎంచుకోవడం మరింత ఈజీ అవుతుంది. భారత్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ తర్వాత, వాహనాల వెనుక భాగంలో కొత్త లోగో మరియు స్టిక్కర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు, దానిపై కారు మోడల్ మరియు టెస్టింగ్ చేసిన సంవత్సరం రాస్తారు.
భారత్ ఎన్ క్యాప్ గురించి లేటెస్ట్ న్యూస్
ఇప్పటికి అయితే, భారత్ ఎన్ క్యాప్ ద్వారా నిర్వహించే అన్ని పరీక్షలు ఎక్కువగా గ్లోబల్ ఎన్ క్యాప్మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంటాయి. ఈ టెస్టుల కోసం, గవర్నమెంట్ ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్ మరియు రోడ్లను కూడా దృష్టిలో ఉంచుకుందని మీకు మరోసారి తెలియజేస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్