- వెల్లడైన స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N సేల్స్ నంబర్లు
- గత నెలలో మొత్తం 13,717 యూనిట్లుగా ఉన్న స్కార్పియో సేల్స్
మే నెలకు సంబంధించి మహీంద్రా థార్ మరియు XUV700 సేల్స్ మరియు ప్రొడక్షన్ నంబర్ల తర్వాత, ఇప్పుడు ఇదే టైమ్ పీరియడ్ కి సంబంధించి మహీంద్రా స్కార్పియో రేంజ్ సేల్స్ నంబర్స్ కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మేము స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N సేల్స్ నంబర్లు మీకు వెల్లడించబోతున్నాము. మీకు ఓ విషయం తెలుసో లేదో, ఈ రెండు మోడల్స్ ని కలిపి స్కార్పియో రేంజ్ అని పిలుస్తారు.
మే-2024లో మహీంద్రా మొత్తంగా 13,717 స్కార్పియో రేంజ్ యూనిట్లను విక్రయించింది. అందులో 12,611 యూనిట్లు కేవలం డీజిల్ వేరియంట్లు ఉండగా, 1,106 యూనిట్ల పెట్రోల్ వేరియంట్లు ఉన్నాయి. సరిగ్గా గత సంవత్సరం ఇదే మే నెలలో మహీంద్రా కంపెనీ 8,528 యూనిట్ల డీజిల్ వేరియంట్లను, 790 యూనిట్ల పెట్రోల్ వేరియంట్లను విక్రయించింది.
అదే విధంగా, మహీంద్రా మే నెలలో 12,553 యూనిట్ల డీజిల్ వేరియంట్లను మరియు 1,208 యూనిట్ల పెట్రోల్ వేరియంట్లను మానుఫాక్చరింగ్ చేసింది. గత సంవత్సరం అనగా 2023 మే-నెలలో మహీంద్రా కంపెనీ 7,242 యూనిట్ల స్కార్పియో డీజిల్ వేరియంట్లను ఉత్పత్తి చేసింది. ఇతర వార్తలలో చూస్తే, ఇండియన్ కార్ మేకర్ XUV700-బేస్డ్ XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీతో ప్రారంభించి, ఈ ఏడాది చివర్లో దాని ఈవీ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్