- అయిదు కలర్లలో అందించబడుతున్న లెక్సస్ LM మోడల్
- లెక్సస్ LMకి పోటీగా ఉన్న టయోటా ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
సాధారణంగా సెలెబ్రిటీలు ఏదో ఒక న్యూస్ తో సోషల్ మీడియాలో ప్రతిరోజూ ట్రెండ్ అవుతూనే ఉంటారు. లగ్జరీ కార్లను కొనుగోలు చేయడంలో సినీ స్టార్ల తర్వాతే ఎవరైనా అనేలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మొన్న తమిళ సూపర్ స్టార్ లెక్సస్ కారు కొనుగోలు చేయగా, ఇప్పుడు సినీ నటి శ్రీదేవి కూతురు, దేవర సినిమాలో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా చేస్తున్న జాన్వీ కపూర్ లెక్సస్ LM మోడల్ ని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.
LM మోడల్ 7-సీటర్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ.2 కోట్లు ఉండగా, 4-సీటర్ వేరియంట్ అల్ట్రా లగ్జరీ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.2.5 కోట్లుగా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 190 కిలోమీటర్లు ఉండగా, ఇది కేవలం 9 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు. అయితే, లెక్సస్ LM అనే లగ్జరీ కారులో అందించబడిన ఫీచర్లు, ఇంటీరియర్ డిజైన్ వంటి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా చదివి మనం తెలుసుకుందాం.
ఇంటీరియర్ ఫీచర్లు
ఇంటీరియర్ పరంగా ఫీచర్ల పరంగా, LM 350h కారు రిమూవ్ చేయడానికి వీలుగా ఉండే రియర్ మల్టీ-ఆపరేషన్ ప్యానెల్ తో 48-ఇంచ్ అల్ట్రా వైడ్ స్క్రీన్, అడ్వాన్స్డ్ ఇన్ ఫ్రా రెడ్ కిరణాల మ్యాట్రిక్స్ సెన్సార్ ఎయిర్ కండిషనింగ్ సిస్టం, ఎయిర్ లైన్-స్టైల్ రిక్లైనర్ సీట్స్, మరియు హీటెడ్ ఆర్మ్ రెస్ట్ మరియు రెండవ వరుసలో ఒట్టోమన్ సీట్స్ కోసం ఫుట్ రెస్ట్ వంటి అద్బుతమైన ఫీచర్లతో వచ్చింది. అంతేకాకుండా, ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్‌తో ప్రీ-కొలిజన్ వార్నింగ్ మరియు ప్రోయాక్టివ్ డ్రైవ్ అసిస్ట్ వంటి ఏడీఏఎస్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్
లెక్సస్ LM 350h 2.5-లీటర్, 4-సిలిండర్, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ తో వచ్చింది. ఈ మోటార్ పెట్రోల్-హైబ్రిడ్ లో 190bhp మరియు 240Nm టార్కును ఉత్పత్తి చేస్తూ ఈ-ఫోర్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీ ద్వారా కారు నాలుగు వీల్స్ కి పవర్ ని అందిస్తుంది.