- మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్ 600 మోడల్ ఖరీదు రూ. 3.50 కోట్లు
- రహనే ఖాతాలో మెర్సిడెస్ బెంజ్ తో పాటుగా ఉన్న బీఎండబ్లూ 6 సిరీస్, ఆడి Q5, వ్యాగన్ ఆర్ కార్లు
ఇండియన్ క్రికెటర్ రహనే కళ్ళు చెదిరే ధరతో రూ.3.50 కోట్లు (ఆన్-రోడ్ ధర) విలువ చేసే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్ 600 సిరీస్ ని తాప్సీ పన్ను, రకుల్ ప్రీత్ సింగ్, రణవీర్ సింగ్, కృతి సనన్ మరియు అర్జున్ కపూర్ కొనుగోలు చేయగా, వారి సరసన ఇప్పుడు అజింక్య రహానే కూడా చేరాడు. లేటెస్ట్ గా రహనే కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్ 600లో ఉన్న ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ మేబాక్ 600 ఫీచర్లు
రహనే కొనుగోలు చేసిన జిఎల్ఎస్ మేబాక్ 600 మోడల్ ని చూస్తే, ఇది ప్రీమియం మెటీరియల్‌తో కూడిన లగ్జరీ క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ 12.3-ఇంచ్ కనెక్ట్ చేయబడిన స్క్రీన్స్, ఒక పనోరమిక్ సన్‌రూఫ్, వివిధ ఫంక్షన్‌లను కంట్రోల్ చేయడానికి వెనుక ఆర్మ్‌రెస్ట్‌లో 7-ఇంచ్ ఎంబియుఎక్స్ సిస్టం, ఫ్రంట్ మరియు రియర్ వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు రియర్ ఎలక్ట్రిక్ సన్‌బ్లైండ్స్ మరియు 64-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్ & స్పెసిఫికేషన్స్
ఈ ఎస్‍యూవీ 4.0-లీటర్ బై-టర్బో V8 పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. దీని ఇంజన్ 550bhp మరియు 730Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది ఎలక్ట్రిక్ మోటారులో కూడా అందించబడగా, 21bhp మరియు 250Nm టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ట్రాన్స్‌మిషన్ విధులు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.