- తక్కువ మొత్తంలోనే అందించబడతాయనిఅంచనా
- మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా రానున్న స్పెషల్ ఎడిషన్లు
ఈ మధ్య కాలంలో సిట్రోన్ కంపెనీ ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఎం ఎస్ ధోనిని దాని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ప్రకటన వెలువడ్డ కొద్దిరోజుల్లోనే అనగా, ఇప్పుడు క్రికెట్ లెజెండ్ ని స్పూర్తిగా తీసుకొని క్రికెటర్ ధోని పేరు మీద C3 మరియు C3 ఎయిర్ క్రాస్ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను ఈ నెలలో లాంచ్ చేయనుంది. స్పెషల్ ఎడిషన్లలో భాగంగా ఈ మోడల్స్ ఎక్స్‌క్లూజివ్ డీకాల్స్ మరియు యాక్సెసరీల వంటి స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంటాయి.
స్పెషల్ ఎడిషన్లలో భాగంగా C3 మరియు C3 ఎయిర్ క్రాస్ మోడల్స్ ఎలాంటి మెకానికల్ మార్పులు లేకుండా కేవలం కాస్మెటిక్ అప్ డేట్స్ మాత్రమే పొందనున్నాయి. అదే విధంగా ఈ రెండు మోడల్స్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని పొందగా, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడి 109bhp/190Nm టార్కును, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి 109bhp/205Nm టార్కును ఉత్పత్తి చేయనున్నాయి. మొదటి C3 మోడల్ దాని లోయర్ స్పెక్ వెర్షన్లలో ఎన్ఎ టర్బో పెట్రోల్ ఆప్షన్ ని పొందవచ్చని భావిస్తున్నాం.
క్రికెట్ ప్లేయర్లపై మరియు వెహికిల్స్ పై ఇండియన్లు చూపించే ప్రేమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు క్రికెటర్లు కేవలం బడ్జెట్ బ్రాండ్లు మాత్రమే కాకుండా ఆడి మరియు బిఎండబ్లూవంటి ఖరీదైన లగ్జరీ బ్రాండ్లకు కూడా అడ్వర్టైజింగ్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇక క్రికెటర్ ధోని విషయానికి వస్తే, 21 సంవత్సరాలు వివిధ లెవెల్స్ లో ఇండియం క్రికెట్ టీంకి సేవలు అందించగా, మొదటిసారిగా సిట్రోన్ కంపెనీ ఎంఎస్ ధోనితో సమన్వయం ఏర్పరచుకొని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ద్వితీయార్థంలో సిట్రోన్ కంపెనీ బసాల్ట్ మోడల్ ని లాంచ్ చేయనుండగా, ఇండియాలో ఎంఎస్ ధోనికి ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని బసాల్ట్ స్పెషల్ వెర్షన్ ని కూడా తీసుకువస్తుందని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్