- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 58 డీలర్ షిప్స్ ని కలిగి ఉన్న సిట్రోన్
- మరో 140 ప్రాంతాల్లో త్వరలో ప్రారంభం
సిట్రోన్ దేశవ్యాప్తంగా 2024 చివరి నాటికి నెట్ వర్క్ విస్తరణ ప్రోగ్రాం (ఎన్ఈపీ) కింద 200 సేల్స్ మరియు సర్వీస్ టచ్-పాయింట్స్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా బ్రాండ్ దేశవ్యాప్తంగా 140కి పైగా ప్రాంతాల్లో దాని సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.
కొత్తగా అదనపు డీలర్ షిప్స్ ద్వారా అర్బన్, సెమి-అర్బన్, మరియు రూరల్ మార్కెట్లలో సిట్రోన్ కంపెనీ ప్రస్తుత 58 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పైగా విస్తరించి బలమైన ముద్రని వేయాలని భావిస్తుంది, దీని ద్వారా దాని నెట్ వర్కును 400 శాతం వృద్ధిని రిజిస్టర్ చేయనుంది.
ఈ నెల ప్రారంభంలో, మేము సిట్రోన్ ప్లాన్స్ లో భాగంగా దాని భవిష్యత్, ఈ సంవత్సరం జూలైలో దాని అన్ని మోడల్స్ అప్ గ్రేడింగ్ కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వివరాలను మీకు అందించాము. సిట్రోన్ మోడల్స్ గురించి అదనంగా చెప్పాలంటే, సి-క్యూబ్ ప్రోగ్రాం కింద, బ్రాండ్ నుంచి వస్తున్న తర్వాతి మోడల్ C3X కూపే అప్‍డేటెడ్ ఇంటీరియర్ తో రానుంది.
నెట్ వర్క్ విస్తరణ గురించి సిట్రోన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా మాట్లాడుతూ “మేము సిట్రోన్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావాలని మరియు టైర్-I మరియు టైర్-II నగరాలకు మించి మా ప్రొడక్ట్స్ కెపాసిటీని విస్తరించాలని చూస్తున్నాము. మా దృష్టిని టైర్-III మరియు టైర్-IV మార్కెట్‌లకు కూడా విస్తరిస్తున్నాము, టైర్-I మరియు టైర్-II నగరాలలో వారి అంచనాలకు తగ్గట్టుగా డిజైన్ చేయబడింది. ఈ మార్కెట్లు క్వాలిటీతో కూడిన ప్రొడక్ట్స్ మరియు సర్వీసులకు సంబంధించి మెరుగైన యాక్సెసిబిలిటీని అందిస్తున్నాయి. ఈ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, మేము డెవలప్ మెంట్ అవకాశాలను పొందడమే కాకుండా చిన్న పట్టణ కేంద్రాల సోషల్-ఫైనాన్స్ డెవలప్ మెంట్ కి దోహదం చేస్తాము.” అని తెలిపారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్