- అన్నీ వేరియంట్స్ పై ఒకేసారి పెరిగిన ధరలు
- అందుబాటులో ఉన్న రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
సిట్రోన్ ఇండియా దేశంలో లాంచ్ అయిన ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ హ్యచ్ బ్యాక్ eC3 ధరలను పెంచింది. ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 11.50 లక్షలు (ఎక్స్-షోరూం)గా ఉంది. ఇప్పుడు, ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ eC3లో లభిస్తున్న అన్నీ వేరియంట్స్ పై రూ. 11,000 ధరలను సవరించింది.
eC3 రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి ఏంటి అంటే, లైవ్ మరియు ఫీల్. దాని తర్వాత ఇది వైబ్ ప్యాక్ మరియు డ్యూయల్-టోన్ ఆప్షన్ లో అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ వెర్షన్స్ లో చూస్తే, సిట్రోన్ eC3 ఎక్స్-షోరూం ధర 11.61 లక్షలుగా ఉంది. దీంతో పాటుగా సిట్రోన్ eC3లో ఉన్న మరి కొన్ని వాటి వేరియంట్-వారీగా ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి.
వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధర |
లైవ్ | రూ. 11.61 లక్షలు |
ఫీల్ | రూ. 12.49 లక్షలు |
ఫీల్ వైబ్ ప్యాక్ | రూ. 12.64 లక్షలు |
ఫీల్ వైబ్ ప్యాక్ డ్యూయల్ టోన్ | రూ. 12.79లక్షలు |
eC3 56bhp మరియు 143 టార్కును ఉత్పత్తి చేయగలిగే ఒకే ఒక్క పవర్డ్ సింగిల్ మోటార్ సెటప్ తో అందుబాటులో ఉంది. ఈ మోటార్ 29.2kWh బ్యాటరీ ప్యాక్ తో పవర్ ని పొంది, ఫుల్ చార్జ్ తో 320 కి.మీ. సర్టిఫైడ్ క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్