- ఇండియాలో రూ. 6.16 లక్షలతో సిట్రోన్ C3 ధరలు ప్రారంభం
- 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజిన్లతో సిట్రోన్ C3 లభ్యం
ఫ్రెంచ్ కార్ల కంపెనీ సిట్రోన్ C3 హ్యచ్ బ్యాక్ ని జూలై-2022లో లాంచ్ చేయగా, రూ. 5.71 లక్షలతో వీటి ఎక్స్-షోరూం ధరలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెలెక్ట్ చేసుకున్న వేరియంట్ ని బట్టి ఈ మోడల్ ఎక్స్-షోరూం ధర రూ. 6.16 లక్షల నుంచి రూ.9.12 లక్షల వరకు ఉంది.
బానెట్ కింద, సిట్రోన్ C3 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజిన్ అనే రెండు ఇంజిన్లతో వచ్చింది. లేటెస్టుగా టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని మేము టెస్ట్ చేయగా, 109bhp మరియు 190Nm టార్కును ఉత్పత్తి చేస్తూ, ఈ కారు రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. ముఖ్యంగా, C3 హ్యచ్ బ్యాక్టర్బో-పెట్రోల్ వెర్షన్ కారు లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని సిట్రోన్ కంపెనీ అధికారికంగా పేర్కొంది.
సిటీలో మేము సిట్రోన్ C3 టర్బో-పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారుపై నిర్వహించిన టెస్టులో, ఈ కారు లీటరుకు 11.7 కిలోమీటర్ల మైలేజీని అందించగా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే(ఎంఐడి)లో 11.7 కిలోమీటర్లు చూపించింది. అదే విధంగా, హైవేపై నిర్వహించిన టెస్టులో లీటరుకు 17.58 కిలోమీటర్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందించగా, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే(ఎంఐడి)లో ఇది 18 కిలోమీటర్లుగా రికార్డు అయ్యింది. పైన చెప్పిన మైలేజీ వివరాలను చూస్తే, యావరేజ్ గా ఈ C3 కారు మైలేజీ లీటరుకు 14.52 కిలోమీటర్లుగా ఉంది. టెస్టింగ్ నిర్వహించిన కారు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు ఉండగా, సింగిల్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీతో 43 కిలోమీటర్లు చాలా ఈజీగా ప్రయాణించవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్