- త్వరలో ధరల ప్రకటన
- 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని పొందనున్న C3 హ్యచ్ బ్యాక్
లేటెస్టుగా బసాల్ట్ మరియు C3 ఎయిర్ క్రాస్ మోడల్ లాంచ్ అయి ట్రెండింగ్ లో కొనసాగుతుండగా, ఇంకా వాటిని మరువకముందే, సిట్రోన్ కంపెనీ C3 హ్యచ్ బ్యాక్ లో అతి ముఖ్యమైన అప్ డేట్ ద్వారా టూ-పెడల్ ఆప్షన్ ని తీసుకువచ్చి దీనిని అప్ డేట్ చేసింది. ఇంకా, ఇంజిన్ మరియు గేర్ బాక్సు విషయానికి వస్తే, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లో 109bhp/205Nm టార్కును ఉత్పత్తి చేయడానికి మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లో 109bhp/190Nm టార్కును ఉత్పత్తి చేయడానికి సిట్రోన్ ఎలాంటి ఇంజిన్ మరియు గేర్ బాక్సుని తీసుకువస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. బసాల్ట్ కారులోని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య తేడా రూ.1.4 లక్షలు మాత్రమే ఉంది. అదే విధంగా ఎయిర్ క్రాస్ విషయానికి వస్తే, వీటి మధ్య తేడా రూ. 1.3 లక్షలు ఉంది. ఇంకా, హ్యచ్ బ్యాక్ కోసం అయితే, ఇది దాదాపు రూ.1.2 లక్షలు ఉండవచ్చని మేము భావిస్తున్నాం. అలాగే, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కేవలం టాప్-స్పెక్ షైన్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది.
బసాల్ట్ కారును ఆవిష్కరించే సమయంలో, సిట్రోన్ కంపెనీ అప్ డేటెడ్ C3 హ్యచ్ బ్యాక్ గురించి వెల్లడించగా, ఇందులో పేర్కొన్న లిస్టులో క్లైమేట్ కంట్రోల్, ఆటో ఫోల్డింగ్‌తో పవర్ మిర్రర్స్ మరియు 14-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారులోని అన్ని వెర్షన్లలో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్స్, మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లో మాత్రమే) వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇందులో అందించబడిన వివిధ అప్ గ్రేడ్ల ద్వారా, మొత్తానికి C3 హ్యచ్ బ్యాక్ ఇతర మోడళ్ళకు పోటీగా వచ్చింది. అందులో మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, రెనాల్ట్ కైగర్ వంటివి ఉండగా, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా, మరియు అప్ కమింగ్ నెక్స్ట్ జనరేషన్ మారుతి డిజైర్ వంటి కాంపాక్ట్ సెడాన్లు కూడా ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్