- అందుబాటులో ఉన్న 4మోనోటోన్ మరియు 7డ్యూయల్-టోన్ కలర్స్
- రూ.6.16లక్షలతో ధరలు ప్రారంభం
సిట్రోన్ ఇండియా తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్, C3 యొక్క కలర్ ఆప్షన్స్ లో కొత్తగా మార్పులను చేసింది. ఈ అప్‌డేట్ తో, టాటా పంచ్ కిపోటీగా ఉన్న సిట్రోన్ C3 ఇప్పుడు 4 మోనోటోన్ మరియు 7 డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇది లైవ్, ఫీల్ మరియు షైన్ అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. దీనిని ప్రారంభ ధర రూ. 6.16 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో పొందవచ్చు.
ఈ మోడల్‌ను బుక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్‌లు, ఇప్పుడు C3ని న్యూ కాస్మో బ్లూ కలర్‌లో డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఆప్షన్‌తో బుక్ చేసుకోవచ్చు. అలాగే మరోవైపు, జెస్టీ ఆరెంజ్ కలర్ ను ప్రైమరీ పెయింట్ ఆప్షన్ నుండి సిట్రోన్ తొలగించింది. ముఖ్యంగా, ఈ C3 హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు పోలార్ వైట్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే మరియు కాస్మో బ్లూతో సహా 4 మోనోటోన్ కలర్స్ ను పొందుతుంది.
క్రింది హుడ్ లో, సిట్రోన్ C3 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ తో 81bhp మరియు 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, రెండోది 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 109bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా, ఈ రెండు ఇంజన్లు ఒకే 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను షేర్ చేసుకున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప