- అధికారికంగా లాంచ్ అయిన C3 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
- కొత్త ఫీచర్లతో వచ్చిన అప్ డేటెడ్ హ్యచ్ బ్యాక్
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ దాని C3 హ్యచ్ బ్యాక్ లో కొత్తగా వచ్చిన ఆటోమేటిక్ వెర్షన్ కార్ల బుకింగ్స్ ని అధికారికంగా ప్రారంభించింది. ఇంకా ఆటోమేటిక్ వెర్షన్ కార్ల ధరను సిట్రోన్ ప్రకటించలేదు. కానీ, ఈ అప్ డేటెడ్ కారు ఎక్స్-షోరూం ధర రూ.6.16 లక్షలతో ప్రారంభమవుతుంది.
ఇందులోని కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ 1.2 –లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో జతచేయబడి వచ్చింది. ఈ యూనిట్ 109bhp మరియు 190Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా, సిట్రోన్ C381bhp మరియు 115Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ ఇంజిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో మాత్రమే జతచేయబడి వచ్చింది.
ఇంకా చెప్పాలంటే, కార్ మేకర్ ఈ అప్ డేటెడ్ కారును మరెన్నో కొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసింది. ఇందులో ప్రధానంగా సేఫ్టీ మరియు సౌక్యర్యానికి సంబంధించిన ఫీచర్లపై సిట్రోన్ ఫోకస్ చేసింది. ఇందులో సేఫ్టీ ప్రధాన అంశంగా 6 ఎయిర్ బ్యాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, మరియు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్ వంటి ఫీచర్లను తీసుకువచ్చింది. అదేవిధంగా, సౌకర్యానికి అనుగుణంగా సిట్రోన్ ఇందులో మెరుగైన ఫీచర్లను తీసుకురాగా, అందులో డోర్లపై పవర్ విండో స్విచెస్, ఫ్రంట్ ప్యాసింజర్ వైపున గ్రాబ్ హ్యాండిల్, ఆటో-ఫోల్డింగ్ ఓఆర్‌విఎంస్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మరియు ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.
ఆసక్తి గల కొనుగోలుదారులు సిట్రోన్ C3 లోని ఏ వేరియంట్ ని అయినా సరే అధికారిక వెబ్ సైట్ మరియు పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న అధికారిక డీలర్ షిప్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్తగా లాంచ్ అయిన C3 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కారు ఆటోమేటిక్ కారు కోసం ఎదురుచూస్తున్న వారికోసం ఓకే బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే, ఇది ప్రాథమికంగా టాటా పంచ్ మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం, ఎందుకంటే ఇవి C3 కారులాగా నిర్దిష్టమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందలేదు. పైన పేర్కొన్న రెండు కార్లు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్స్ ని పొందాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్