- ఫీల్ అండ్ షైన్ వేరియంట్ ఆధారంగా వచ్చిన మోడల్స్
- ఇప్పటికే ఉన్న ధరపై అతి తక్కువగా పెరిగిన ధర
సిట్రోన్ కంపెనీ ఇండియాలో తన మూడవ-వార్షికోత్సవ వేడుకల సందర్భంగా C3 మరియు eC3 బ్లూ ఎడిషన్‌లను పరిచయం చేసింది. ఈ కార్స్ లో కొన్ని మార్పులు చేయడమేకాకుండా మరియు కొత్త ఫీచర్లను జత చేస్తూ, ప్రస్తుతం ఉన్న ఎక్స్-షోరూమ్ ధర కంటే వీటి ధరలను రూ.14వేలకు పైగా పెంచింది.
సిట్రోన్ బ్లూ ఎడిషన్
వరుసగా C3 బ్లూ మరియు eC3 బ్లూ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లలో ప్రత్యేకమైనవి. కార్‌మేకర్ వీటిని కేవలం ఫీల్ మరియు షైన్ వేరియంట్‌లలో మాత్రమే అందిస్తుంది, వీటి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో ఎటువంటి మార్పులు లేవు. అయితే, ఇది కొన్ని మార్పులలో భాగంగా ఆరెంజ్ యాక్సెంట్స్ కి బదులుగా కాస్మో బ్లూ కలర్ ని పొందింది. అంతేకాకుండా, ప్రత్యేకఇంటీరియర్ డీకాల్స్ మరియు ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్స్, బ్రాండెడ్ నెక్‌రెస్ట్స్ మరియు సీట్-బెల్ట్ కుషన్స్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి అదనపు ఫీచర్లను కూడా పొందాయి.
సిట్రోన్ బ్లూ ఎడిషన్ లభ్యత మరియు బుకింగ్స్
సిట్రోన్ బ్లూ ఎడిషన్‌లలో చేసిన ఈ మార్పులు మరియు ఫీచర్ అప్ డేట్స్ పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ఇప్పటికే బుకింగ్‌లు జరుగుతున్నందున డీలర్లు త్వరలో కార్ల డెలివరీని ప్రారంభిస్తారు. అంతేకాకుండా, కార్‌మేకర్ ఇటీవల C3 మరియు eC3 రెండింటి పై ధర తగ్గింపులను ప్రకటించింది, దాని ద్వారావీటిపై ధరలను మరింత చవకగా చేసింది. నెట్‌వర్క్ విస్తరణ కార్యక్రమం (ఎన్ఈపీ) కింద, సిట్రోన్ ఈ సంవత్సరం చివరి నాటికి 200 డీలర్‌షిప్‌ల వద్ద ఇండియాలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడం కొనసాగిస్తోంది. అంతేకాకుండా, తన డీలర్ నెట్‌వర్క్‌ను స్ట్రాంగ్ చేయడంలో ఇది సహాయపడుతూ సిట్రోన్ కార్ ఓనర్ షిప్ ఎక్స్‌పీరియన్స్ లో సహాయపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప