- డిజైన్లో భారీగా మార్పులను తీసుకువచ్చే అవకాశం
- ఒకే రకమైన పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ తో రానున్న రెండు మోడల్స్
సిట్రోన్ కంపెనీ C3 మరియు C3 ఎయిర్ క్రాస్ మోడల్స్ ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్లను వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనుంది. డిజైన్ మరియు మెటీరియల్ లో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో దీని లుక్ మరింత ప్రీమియంగా ఉండనుంది. అదే విధంగా, ప్రస్తుత లైనప్ లో ఉన్న మోడల్స్ ఈ ఏడాది జూలై నాటికి మరిన్ని అప్ డేట్స్ ని పొందనున్నాయి.
2025 సిట్రోన్ కార్ల డిజైన్, ఫీచర్స్ మరియు కీలక అంశాలు
2025 సిట్రోన్ మోడల్స్ ఫ్రెంచ్ స్టైలింగ్ లో రీస్టైలింగ్ ల్యాంప్స్, రీడిజైన్డ్ బంపర్స్ మరియు మరెన్నో కాస్మోటిక్ అప్‍డేట్స్ ని పొందనున్నాయి. ప్రస్తుత లైనప్ లో ఉన్న ఫీచర్లు ఇండియన్ కస్టమర్లకు పెద్దగా నచ్చకపోవడంతో వాటిని తొలగించింది. అయితే, ఈ మిస్సింగ్ ఫీచర్లను 2025 మోడల్స్ లో సిట్రోన్ మళ్ళీ పరిచయం చేయనుంది. టాప్-స్పెక్ C3 ఎయిర్ క్రాస్ లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయని మేము భావిస్తున్నాం. ఈ ఫీచర్లన్ని దీనికి పోటీగా ఉన్న మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఈ మిడ్-సైజ్ ఎస్‍యూవీలో ఫ్లెక్సిబుల్ సీటింగ్ ఆప్షన్లను కొనసాగించనుంది.
ఫేస్‍లిఫ్టెడ్ C3 మరియు C3 ఎయిర్ క్రాస్ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
తాజాగా పరిచయం చేయబడిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు మరియు ఇంజిన్ ఆప్షన్లను సిట్రోన్ ఇందులో కొనసాగిస్తుంది. C3 ఎయిర్ క్రాస్ 109bhp ని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో వచ్చింది. మరోవైపు C3, రెండు ఆప్షన్లను పొందింది. మొదటి 1.2-లీటర్ టర్బో 6-స్పీడ్-మాన్యువల్ తో జత చేయబడి, మరియు 81bhp ని ఉత్పత్తి చేసే నేచురల్లీ ఆస్పిరేటేడ్ 1.2-లీటర్ యూనిట్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ జత చేయబడి వచ్చింది.
ధర మరియు కాంపీటీషన్
అదనపు ఫీచర్లు మరియు కాస్మోటిక్ మార్పుల ద్వారా ఫేస్‍లిఫ్టెడ్ మోడల్స్ ధరలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని మేము భావిస్తున్నాము. ఇంకా చెప్పాలంటే, C3 ఎయిర్‌క్రాస్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ మరియు మరిన్ని కార్లకు పోటీగా ఉంటుందని మనం ఆశించవచ్చు. అదే విధంగా, C3 హ్యచ్ బ్యాక్ టాటా పంచ్, మారుతి ఇగ్నిస్, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు పోటీగా ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్