- లిమిటెడ్ యూనిట్లపై మాత్రమే లభిస్తున్న ఆఫర్
- C3 ఎయిర్ క్రాస్ రేంజ్ లో మిడ్-స్పెక్ వేరియంట్ గా అందించబడుతున్న ప్లస్ వేరియంట్
ఫ్రెంచ్ కార్ల తయారీ కంపెనీ సిట్రోన్ లేటెస్టుగా C3 ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ ని ఇండియాలో రూ. 11.82 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. కార్ మేకర్ ఇప్పుడు ఎస్యూవీ మిడ్-లెవెల్ వేరియంట్ పై స్పెషల్ డిస్కౌంట్ ని అందిస్తున్నట్లు ప్రకటించింది.
సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ మొత్తంగా యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులోని మిడ్-స్పెక్ వేరియంట్ గా అందించబడిన ప్లస్ వేరియంట్ పై రూ. 2.62 లక్షల ఫ్లాట్ డిస్కౌంట్ ని సిట్రోన్ కంపెనీ అందిస్తుంది. ఇక్కడ మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వేరియంట్లో లిమిటెడ్ యూనిట్లకు మాత్రమే సిట్రోన్ ఆఫర్ ని పరిమితం చేసింది. దీంతో, ఇంతకు ముందు సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ మోడల్ రూ. 11.61 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఈ ఆఫర్ రాకతో రూ. 8.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది.
ఈ బెనిఫిట్ కి సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం అని మేము సిట్రోన్ కంపెనీని సంప్రదించగా, ఈ ఆఫర్ డీలర్ నుంచి డీలర్ కి మారవచ్చు అని, అలాగే ఇది డ్యూయల్-టోన్ మరియు 7-సీటర్ మోడల్స్ పై లాంటి ఇతర వెర్షన్లపై వర్తిస్తుందని సిట్రోన్ కంపెనీ పేర్కొంది. కాబట్టి, ఈ ఆఫర్ కి సంబంధించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సిట్రోన్ డీలర్ ని సంప్రదించగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్