- అందుబాటులో ఉన్న 3 వేరియంట్స్
- కేవలం సింగిల్ పవర్ ట్రెయిన్ తో లభ్యం
ఏప్రిల్ 2023లో ఆవిష్కరణ తర్వాత, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ సెప్టెంబరులో రూ.9.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో ఇండియన్ సేల్స్ మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇది 3 వేరియంట్స్ లో అనగా యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే వేరియంట్స్ లో 5 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు, ఈ ఆటోమేకర్ ఈ నెలకు సంబంధించి రూ.1 లక్ష వరకు భారీ డిస్కౌంట్ అందిస్తుంది.
ప్రస్తుతం, ఈ కార్ కంపెనీ రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, 5 ఏళ్ల వరకు రూ.25,000 లేదా 60,000 కి.మీ. వరకు పొడిగింపు వారంటీ, మరియు 50,000 కి.మీ. లేదా 5 ఏళ్ల వరకు రూ. 45,000 విలువ చేసే వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. ఎవరైనా కస్టమర్స్ పైన పేర్కొన్న ఈ ఆఫర్స్ వద్ధనుకంటే రూ. 90,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.
C3 ఎయిర్ క్రాస్ లో ఉండే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 108bhp మరియు 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఏకైక మిల్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి మరియు ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడిన 18.5కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.
C3 ఎయిర్ క్రాస్ పోటీగా హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మరియు టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఉన్నాయి. అదే విధంగా ఇది టాప్-స్పెక్ వేరియంట్స్ అయిన హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్, మరియు మహీంద్రా ఎక్స్‌యువి300 లాంటి వాటితో పోటీ పడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్