- C3 ఎయిర్‌క్రాస్ లో ఇప్పుడుస్పెషల్ ఎడిషన్ గా వచ్చిన ధోనీ ఎడిషన్
- క్రికెటర్ ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించిన సిట్రోన్
ఇండియాలో సిట్రోన్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని ప్రకటించిన నేపథ్యంలో, కార్‌మేకర్ దేశవ్యాప్తంగా C3 ఎయిర్‌క్రాస్ లో 100 యూనిట్ల లిమిటెడ్ నెంబర్స్ తో ధోనీ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.అతని పేరు మీద ఉన్న ఈ స్పెషల్ ఎడిషన్‌లోని మొదటి టాప్-5 హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.
డ్యూయల్ టోన్ లుక్స్
సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ తో వైట్ రూఫ్ ను కలిగి ఉంది. డీలర్లు నిర్ధారించినట్లుగా, ఎక్స్‌టీరియర్ బ్లూ కలర్ లో కస్టమర్‌లకు అందుబాటులో ఉన్న ఏకైక వేరియంట్ ఇదే.
యూనిక్ డీకాల్స్
(వెనుక) రియర్ డోర్‌పై ధోనీ జెర్సీ నెంబర్‌ను సూచించే విధంగా రూపొందించిన భారీగా '7' నెంబర్ డీకాల్ ఉంది. అలాగే, హుడ్‌పై కూడా ఈ ఐకానిక్ 7 నెంబర్ స్టిక్కర్‌ను మీరు చూడవచ్చు.
స్పెషల్ బ్యాడ్జింగ్
C3 ఎయిర్‌క్రాస్ లో ఈ స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్ నుండి వేరుగా కనిపించేందుకు (ముందు) ఫ్రంట్ డోర్స్ పై 'ధోని ఎడిషన్' గ్రాఫిక్‌ల బ్యాడ్జింగ్‌ను కూడా మీరు చూడవచ్చు.
స్పెషల్ యాడ్-ఆన్‌లు
స్పెషల్ ఎడిషన్ అని ఎందుకు పిలువబడుతుంది అంటే స్పెషల్ యాక్సెసరీస్ తో అందించబడింది కాబట్టి, ఇందులో థీమ్ కుషన్స్, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్స్, సీట్‌బెల్ట్ కుషన్స్ మరియు ఫ్రంట్ డాష్ క్యామ్ వంటి యాక్సెసరీస్లను పొందింది.
బ్రాండెడ్ ప్రొడక్ట్స్
అదనంగా, C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ ని కొనుగోలుదారులు మహేంద్ర సింగ్ ధోని సహకారంతో రూపొందించబడిన అస్యూర్డ్ ప్రొడక్ట్స్ ను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.
సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ పవర్‌ట్రెయిన్ వివరాలు
స్పెషల్ ఎడిషన్ C3 ఎయిర్‌క్రాస్ స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకోబడిన 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ను పొందింది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ 109bhp/190Nmలేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ 109bhp/205Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప