- ఇండియాలో C3 ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ ధర రూ. 11.82 లక్షలు
- దేశవ్యాప్తంగా 100 యూనిట్లతో మాత్రమే అందుబాటులోకి వచ్చిన లిమిటెడ్ ఎడిషన్
ఈ వారం ప్రారంభంలో, సిట్రోన్ ఇండియా C3 ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ ని రూ. 11.82 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ నెల (జూన్) 18వ తేదీన స్పెషల్ ఎడిషన్ బుకింగ్స్ ప్రారంభమవ్వగా, ఇప్పుడు ఈ కారు దేశవ్యాప్తంగా లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
ఇక్కడ ఫోటోలలో చూసినట్లుగా, కొత్త C3ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ కారుకు రెండు వైపులా మరియు టెయిల్ గేట్ పై “7” అనే స్టికర్ ని పొందగా, ఫ్రంట్ డోర్స్ పై కూడా ‘Dhoni Edition’ అనే స్టిక్కర్లను పొందింది. ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే ఈ కారు సీట్ బెల్ట్ కుషన్స్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్స్, కుషన్స్, మరియు ఫ్రంట్ డ్యాష్ క్యామ్ పై ధోని ఎడిషన్ తో కూడిన స్పెషల్ ఎలిమెంట్లను పొందింది. ముఖ్యంగా, సీట్లు కూడా “7” నెంబర్ స్టిచింగ్, బ్లూ ఇన్సర్ట్స్, మరియు ఆరెంజ్ స్టిచింగ్ వంటి వాటితో వచ్చాయి.
ఈ మోడల్ కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం కాగా, 2024C3 ఎయిర్ క్రాస్ ధోని ఎడిషన్ ని కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు గ్లోవ్ బాక్స్ లో ధోని-థీమ్డ్ యాక్సెసరీలను పొందుతుండగా, ఇందులో ఒక లక్కీ కస్టమర్ క్రికెటర్ ధోని ఆటోగ్రాఫ్ తో కూడిన గ్లోవ్స్ ని సొంతం చేసుకునే అవకాశాన్ని పొందుతారు. మీకు కూడా ధోని ఆటోగ్రాఫ్ తో కూడిన గ్లోవ్స్ ని పొందాలని ఉందా ? అయితే, వెంటనే ఈ లిమిటెడ్ ఎడిషన్ ని బుక్ చేసుకొని ఈ అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్