- జనవరి 29న లాంచ్ అయ్యే అవకాశం
- అందుబాటులో ఉన్నరెండు వేరియంట్స్
కొన్ని వారాల ముందే, సిట్రోన్C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్‌ల వివరాలను ప్రత్యేకంగా మేము మీకు తెలియజేశాము. ఇప్పుడు, 29న, జనవరి 2024లో ఇండియాలో జరగబోయే అధికారిక లాంచ్‌కు ముందే ఇండియన్ మార్కెట్ లోC3 ఎయిర్‌క్రాస్ యొక్క బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్‌లు సమీపంలోని ఉన్నఅధికారిక డీలర్‌షిప్ వద్ద రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో ఈ మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఈ ఈ సిట్రోన్ ఆటోమేటిక్ C3 ఎయిర్‌క్రాస్ మాక్స్ మరియు ప్లస్ అనే 2 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఫీచర్స్ పరంగా చూస్తే, మొబైల్ కనెక్టివిటీతో 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, న్యూ7 -ఇంచ్ టిఎఫ్‌టి క్లస్టర్, యూఎస్‌బి ఛార్జింగ్, సెన్సార్‌లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, రూఫ్-మౌంటెడ్ రియర్ ఎయిర్‌కాన్ వెంట్స్, వాషర్‌తో వెనుక వైపర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, మరియు రిమోట్ ఏసీ ప్రీకండీషనింగ్ వంటి ఫీచర్స్ఉన్నాయి.
సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో 109bhp మరియు 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఈ మోటారు మాన్యువల్ గేర్ సెలెక్టర్ మోడ్‌తో 6 -స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో మాత్రమే జతచేయబడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప