- 5 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్స్ తో వచ్చిన ఆటోమేటిక్ వేరియంట్
- అందుబాటులో ఉన్న 2 వేరియంట్స్
సిట్రోన్ ఇండియా దేశం అంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్‌ను మొత్తానికి మార్కెట్ లో లాంచ్ చేసింది, దీనిని ధర రూ. 12.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. ఇది మ్యాక్స్ మరియు ప్లస్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అలాగే, ఈ ఎస్‌యువిని 5 మరియు 7- సీటర్ కాన్ఫిగరేషన్స్ తో పొందవచ్చు.
దీని క్రింది హుడ్ లో, మాన్యువల్ వేరియంట్‌లో చూసినట్లుగా ఇది1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది . అంతేకాకుండా, ఇందులో మాన్యువల్ వేరియంట్ 109bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తే, ఆటోమేటిక్ వేరియంట్ 109bhp మరియు 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జతచేయబడుతుంది.
ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రిమోట్ ఏసీ ప్రీకండిషనింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 7-ఇంచ్ టిఎఫ్‌టి క్లస్టర్, యూఎస్‌బి ఛార్జర్, మరియు మూడవ వరుసలో ఏసీ వెంట్స్, వన్-టచ్ ఆటో పవర్ 4 విండోస్ డౌన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వేరియంట్ వారీగా సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్స్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
ప్లస్ ఏటీ సీటర్ | రూ. 12,84,800 |
మ్యాక్స్ ఏటీ 5 సీటర్ | రూ. 13,49,800 |
మ్యాక్స్ ఏటీ 5+2 సీటర్ | రూ. 13,84,800 |
అనువాదించిన వారు: రాజపుష్ప