- అందుబాటులో ఉన్న 5 మరియు 7-సీటర్ ఆప్షన్స్
- అక్టోబర్ 15, 2023 నుంచి డెలివరీ ప్రారంభం
సిట్రోన్ ఇండియా దేశీయ మార్కెట్లోకి C3 ఎయిర్ క్రాస్ ఎస్యువిని రూ.9.99లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. C3 హ్యచ్ బ్యాక్ బేస్డ్ ఎస్యువిని 3 వేరియంట్స్ మరియు 2 సీటింగ్ కాన్ఫిగరేషన్స్ లో పొందవచ్చు. అక్టోబరులో ఈ ఫ్రెంచ్ ఎస్యువికి సంబంధించిన డెలివరీ ప్రారంభమవగా, దీనిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ కు ఈ నెలలో రూ. 55,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి.
సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే వేరియంట్స్ లో 10 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఉన్న డిస్కౌంట్స్ ని ఒకసారి పరిశీలిస్తే, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్, మెయింటెనెన్స్ ప్యాకేజీ, క్యాష్ డిస్కౌంట్, కార్పోరేట్ ఆఫర్స్, మరియు ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ తో కలిపి రూ.55,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి.
మెకానికల్ గా, C3 ఎయిర్ క్రాస్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడిన పవర్డ్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ మోటార్ బిఎస్-6 ఫేజ్ 2.0- కంప్లైంట్ అధారంగా 109bhp మరియు 190Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్