- ఆగస్టు 2వ తేదీన లాంచ్
- అప్ కమింగ్ టాటా కర్వ్ తో పోటీపడనున్న బసాల్ట్
సిట్రోన్ ఇండియా కంపెనీ దాని అప్ కమింగ్ బసాల్ట్ ఎస్‍యూవీతో కొత్త కూపే ఎస్‍యూవీ సెగ్మెంట్లోకి అడుగుపెడుతుంది. ఆగస్టు 2వ తేదీన ఈ మోడల్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవ్వడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కారు ధర అధికారిక ప్రకటనకు ముందు, సెలెక్ట్ డీలర్ షిప్స్ లో బసాల్ట్ ఎస్‍యూవీకి సంబంధించి ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభమైంది.
ఎవరైతే కస్టమర్లు అప్ కమింగ్ సిట్రోన్ కూపే ఎస్‍యూవీపై ఆసక్తి కలిగి ఉన్నారో వారు రూ.25,000 టోకెన్ అమౌంట్ ని చెల్లించి తమ పేరుపై బుక్ లేదా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ని మీరు ప్రారంభించాలనుకుంటే, మీరు మీకు దగ్గరలో ఉన్న సిట్రోన్ అధికారిక డీలర్ షిప్ ని సందర్శించగలరు.
అయితే, అప్ కమింగ్ బసాల్ట్ ఎస్‍యూవీలో అందించబడే ఫీచర్ లిస్టు వివరాలపై సిట్రోన్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందించలేదు కానీ, లేటెస్టుగా రిలీజ్ అయిన బసాల్ట్ టీజర్లో చాలా సమాచారం అందించబడింది. ఈ C3 ఎయిర్ క్రాస్ బేస్డ్ కూపే కలర్డ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఆర్మ్‌రెస్ట్, సైడ్ సపోర్ట్‌తో హెడ్‌రెస్ట్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో రానుంది. అలాగే ఈ కారు వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్ మరియు ప్యాకేజీలో భాగంగా క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందుతుందని భావిస్తున్నాము.
మెకానికల్ గా, బసాల్ట్ C3 ఎయిర్ క్రాస్ మోడల్ లో అందించబడిన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వస్తుండగా, ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్లతో జతచేయబడి అందించబడుతుంది. ఈ మోటారు 109bhp మరియు 205Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేయనుంది.
లాంచ్ అయిన తర్వాత, సిట్రోన్ బసాల్ట్ కారు టాటా కర్వ్ నుంచి అతి పెద్ద పోటీని ఎదుర్కొనబోతుంది. కర్వ్ కారు పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే కాకుండా, ఈవీ ఇటరేషన్ ని కూడా పొందుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్