- ఆగస్టు 2వ తేదీన అధికారిక అరంగేట్రం
- మెరుగైన వెంటిలేషన్ ఆప్షన్లతో రానున్న సిట్రోన్ మొదటి బడ్జెట్ మోడల్
సిట్రోన్ కంపెనీ ఆగస్టు 2వ తేదీన బసాల్ట్ కారును ఆవిష్కరించనుండగా, దాని బడ్జెట్ రేంజ్ లో భారీ అప్ డేట్స్ ని కూడా అందించనుంది. అలాగే ఈ కూపే ఎస్‍యూవీ స్టాండర్డ్ ఫీచర్లతో రానుంది. ఎక్స్‌టీరియర్ ని చూస్తే, ఈ కారు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అలాగే అతిపెద్ద అంశం ఏంటి అంటే, లోపల క్లైమేట్ కంట్రోల్ సిస్టంని కూడా పొందుతుంది. లేటెస్ట్ టీజర్ ద్వారా అన్ని ఫంక్షన్లకు బటన్లతో కూడిన సింగిల్-జోన్ యూనిట్ ఉండనున్నట్లు వెల్లడైంది. డిజైన్ కూడా ఎలా ఉంది అంటే, C3, eC3 లాగా ఉంటుందని భావిస్తుండగా, బహుశా C3 ఎయిర్ క్రాస్ కంటే మెరుగైన డిజైన్ తో రానుంది.
టీజర్ లో కూడా వెల్లడైన విషయం ఏంటి అంటే, ఈ కారు C3 ఎయిర్ క్రాస్ మోడల్ లాగే ఒకే రకమైన 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తో రానుందనే విషయం వెల్లడైంది. అలాగే బసాల్ట్ కారు సైడ్ సపోర్టుతో హెడ్ రెస్ట్స్ మరియు డ్యూయల్ కప్ హోల్డర్లతో ఫ్రంట్ మరియు రియర్ ఆర్మ్ రెస్ట్స్ వంటి వాటిని పొందనుంది. మొత్తంగా, ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని సిట్రోన్ కార్లు 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా పొందనున్నాయి.
సిట్రోన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో దాని సి-క్యూబ్ ప్రోగ్రాంలో భాగంగా, బసాల్ట్ కారును నాలుగవ మోడల్ గా తీసుకువస్తుంది. బసాల్ట్ కారులో 109bhp/205Nm టార్కును ఉత్పత్తి చేయడానికి 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో అందించనుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి వస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్