- C3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యువి ఆధారంగా వస్తున్న మోడల్
- టాటా కర్వ్ కి గట్టి పోటీగా ఉండనున్న సిట్రోన్
సిట్రోన్ ఇండియా C3 ఎయిర్‌క్రాస్ ఆధారిత కూపే ఎస్‌యువి, బసాల్ట్‌ను త్వరలో ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిని ఆవిష్కరించే తేదీ ఆగష్టు2, 2024కి సెట్ చేయబడింది, తర్వాత మరికొన్ని వారాల్లో దీని ధర ప్రకటించబడుతుంది.
టీజర్ ఫోటోలు మరియు వివిధ స్పై చిత్రాల ప్రకారం, బసాల్ట్ సిట్రోన్ లోగో వరకు ఉండే సిగ్నేచర్ టూ-స్లాట్ గ్రిల్‌తో సాధారణమైన సిట్రోన్ ఫేస్ కలిగి ఉంటుంది.ఇంకా చెప్పాలంటే, కూపే లుక్ ను మరింత మెరుగుపరిచేందుకు రేడియేటర్ గ్రిల్‌తో ఉండే ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంటుంది.
ఇతర డిజైన్ (ఎలిమెంట్స్)అంశాలలోఫ్లాప్-స్టైల్ డోర్ హ్యాండిల్స్, ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌స్ మరియు రైజ్-అప్ టెయిల్‌గేట్ ప్యానెల్ ఉండన్నాయి. అంతేకాకుండా, బసాల్ట్ దాని గంభీరమైన అగ్రెసివ్ లుక్ ని జోడించడానికి చుట్టూ మందపాటి క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది.
ఫీచర్ల విషయానికొస్తే, బసాల్ట్ కూపే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్స్ తో వచ్చే అవకాశం ఉంది.
మెకానికల్‍గా, ఫ్రెంచ్ ఆటోమేకర్ C3 ఎయిర్‌క్రాస్ లో చూసిన, అదే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మోటారును బసాల్ట్‌లో కూడా అందించనుంది. అలాగే, ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి 109bhp పవర్ మరియు 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
లాంచ్ తర్వాత సిట్రోన్ బసాల్ట్ కారు అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ ఒకదానితో ఒకటి గట్టి పోటీపడతాయి. అలాగే, రెండోది కర్వ్ కారు త్వరలో లాంచ్ కానుండగా, ఇదిఐసిఇ మరియు ఈవీ అనే రెండు రూపాల్లో అందించబడుతుంది.