సిట్రోన్ బసాల్ట్, ఒక కూపే ఎస్‍యూవీ కాగా, బ్రాండ్ కి ఇది ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ గా నిలిచింది. కూపే ఎస్‍యూవీ సెగ్మెంట్ లో ప్రవేశించిన వాటిలో ఇప్పుడు సిట్రోన్ బసాల్ట్ కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే, బసాల్ట్ హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ మరియు మరిన్ని మిడ్-సైజ్ ఎస్‍యూవీలతో పోటీపడుతోంది.
గత వారం, సిట్రోన్ ఈ మోడల్‌ను రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, ఈ వారం ప్రారంభంలో వేరియంట్ వారీగా ధరలను కూడా వెల్లడించింది. ఈ కారు నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బోచార్జ్డ్ రూపాల్లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడింది. ఈ ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, 6 -స్పీడ్ మాన్యువల్ మరియు 6 -స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో జత చేయబడ్డాయి.
టాటా కర్వ్ కి గట్టి పోటీగా నిలిచిన దీనిని కొనుగోలు చేసే వినియోగదారులు - పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్, పోలార్ వైట్‌తో ప్లాటినం గ్రే మరియు గార్నెట్ రెడ్‌తో పెర్ల్ నెరా బ్లాక్ అనే 7 కలర్స్ నుండి ఎంచుకోవచ్చు. వేరియంట్స్ విషయానికొస్తే, బసాల్ట్ ను యూ, ప్లస్ మరియు మాక్స్ అనే మూడు వేరియంట్స్ లో పొందవచ్చు. అలాగే, ఈ మోడల్ ఫీచర్ల వివరాలు వేరియంట్స్- వారీగా క్రింద ఇవ్వబడినవి.
సిట్రోన్ బసాల్ట్ యూ వేరియంట్ ఫీచర్స్ బాడీ-కలర్డ్ బంపర్స్ గ్రిల్ పై క్రోమ్ ఇన్సర్ట్స్ బ్లాక్డ్-అవుట్ ఎ- మరియు బి-పిల్లర్స్ బాడీ సైడ్ సిల్ క్లాడింగ్ 16-ఇంచ్ స్టీల్ వీల్స్ రెండు వరుసల కోసం ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌స్ ఫ్రంట్ పవర్ విండోస్ 12V ఫ్రంట్ పవర్ సాకెట్ 6 ఎయిర్‌బ్యాగ్స్ ఈబీడీతో కూడిన ఏబీఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈఎస్‍పీ మరియు హెచ్ హెచ్ సీ స్పీడ్ అలర్ట్ సిస్టమ్ |
సిట్రోన్ బసాల్ట్ ప్లస్ వేరియంట్ ఫీచర్స్ గ్రిల్ పై హై గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ బాడీ-కలర్డ్ డోర్ హ్యాండిల్స్ వీల్ ఆర్చ్ క్లాడింగ్ ఫుల్ వీల్ కవర్స్ ఒఆర్‍విఎంస్ పై టర్న్ ఇండికేటర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు గ్రే డ్యాష్‌బోర్డ్ ఫ్రంట్ మరియు రియర్ డోర్ ఫాబ్రిక్ ఆర్మ్‌రెస్ట్‌స్ రెండు వరుసలలో సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్‌స్ 10.2-ఇంచ్టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ 4 స్పీకర్స్ స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్ రిమోట్ కీలెస్ ఎంట్రీ ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు ఫోల్డబుల్ ఒఆర్‍విఎంస్ టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ పార్శిల్ ట్రే రియర్ యూఎస్‌బి ఛార్జర్ 7- ఇంచ్ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ టిపిఎంఎస్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) ఫాగ్ లైట్స్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) ప్రింటెడ్ రూఫ్‌లైన్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్(టర్బో వేరియంట్ లో మాత్రమే) రియర్ ఏసీ వెంట్స్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) రియర్ డీఫాగర్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) ఇంజిన్ స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ (టర్బో వేరియంట్ లో మాత్రమే) స్టోరేజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ రెండవ వరుసలో డ్యూయల్ యూఎస్‌బి టైప్-సి ఛార్జర్‌లు (టర్బో వేరియంట్ లో మాత్రమే) |
సిట్రోన్ బసాల్ట్ మాక్స్ వేరియంట్ ఫీచర్స్ 16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ షార్క్-ఫిన్ యాంటెన్నా బాడీ సైడ్ డోర్ మౌల్డింగ్ మరియు ఇన్సర్ట్‌స్ లెదర్‍తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ ఫ్రంట్ మరియు రియర్ డోర్ లెథెరెట్ ఆర్మ్‌రెస్ట్ 4 స్పీకర్స్ మరియు రెండు ట్వీటర్స్ 40 స్మార్ట్ ఫీచర్లతో మై సిట్రోన్ కనెక్ట్ వైర్లెస్ ఛార్జర్ రివర్స్ పార్కింగ్ కెమెరా రియర్ సీట్ స్మార్ట్ టిల్ట్ కుషన్ (టర్బో ఏటీ వేరియంట్ లో మాత్రమే) డ్యూయల్-టోన్ రూఫ్ (ఆప్షన్) |
అనువాదించిన వారు: రాజపుష్ప