- టాటా కర్వ్ కి పోటీగావచ్చిన బసాల్ట్
- రెండు ఇంజిన్లు మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో అందించబడుతున్న మోడల్
సిట్రోన్ ఇండియా బసాల్ట్ ధరలను ఈ రోజు ఇండియన్ మార్కెట్లో ప్రకటించింది, దీనిని రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. అంతే కాకుండా, టాటా కర్వ్ తో పోటీపడే ఈ కూపే ఎస్‌యువిని ఈ నెల ప్రారంభంలో దాని ప్రొడక్షన్ రూపంలో సిట్రోన్ ఆవిష్కరించింది. అలాగే, బసాల్ట్ కూపే ఎస్‌యువి బుకింగ్స్ కేవలం రూ. 11,001 టోకెన్ అమౌంట్ తో ప్రారంభంకాగా, బుకింగ్ అమౌంట్ చెల్లించి కస్టమర్లు అక్టోబర్ 31 వరకు ఈ కూపే కారును బుక్ చేసుకోవచ్చు.
2024 బసాల్ట్ 1.2-లీటర్, 3-సిలిండర్స్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బోచార్జ్డ్ రూపాల్లో పెట్రోల్ ఇంజిన్ ను పొందింది. మొదటిది 80bhp మరియు 115Nm ఉత్పత్తి చేస్తే, టర్బో వెర్షన్ 109bhp మరియు 190Nm ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లో 205Nm టార్క్‌నుఉత్పత్తి చేస్తుంది. ఇందులోనిట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లకు పరిమితం చేయబడ్డాయి. మేము ఈ కారు మైలేజీ వివరాలను సేకరించి కార్ వాలే వెబ్‌సైట్‌లో ఉంచాము. ఆ వివరాలను మీరు మా వెబ్‌సైట్‌లో మీరు చదువుకోవచ్చు.
బయటి వైపు, కొత్త సిట్రోన్ బసాల్ట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ట్విన్ స్లాట్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, సర్క్యులర్ ఫాగ్ లైట్స్, బ్లాక్-అవుట్ ఒఆర్‍విఎంఎస్ మరియు బి-పిల్లర్స్ మరియు ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది.ఇంకా చెప్పాలంటే, ఇది డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌లైట్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు ఆప్షనల్ కాంట్రాస్ట్-కలర్డ్ రూఫ్‌లను కూడా పొందింది.
లోపలివైపు, బసాల్ట్ కూపే ఎస్‌యువి 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండవ వరుసకు త్రీ-స్టెప్ అడ్జస్టబుల్ (తొడ) సపోర్ట్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, రియర్ ఏసీ వెంట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీను వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది.
అనువాదించిన వారు: రాజపుష్ప