- ఈ ఏడాది చివరలో లాంచ్ కానున్న బసాల్ట్ మోడల్
- టాటా కర్వ్ వంటి కార్లకు పోటీగా ఉండనున్న ఎస్‍యూవీ
గత నెలలో కూపే ఎస్‍యూవీకి సంబంధించిన దాని కాన్సెప్ట్ అవతార్‌ను ఆవిష్కరించిన కొద్దిసేపటికే, సిట్రోన్ C3 బసాల్ట్ ప్రొడక్షన్-రెడీ వెర్షన్ మొదటిసారి కనిపించింది. ఈ కొత్త స్పై షాట్స్ చూస్తే, రాబోయే (అప్‍కమింగ్) కారు ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ కి సంబధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి. ఇవి ఈ మోడల్ కి సంబంధించి దీని లుక్ పరంగా మెరుగైన సమాచారాన్ని అందిస్తున్నాయి.
బయటి వైపు చూస్తే,ఎక్స్‌టీరియర్ పరంగాప్రొడక్షన్-రెడీ లుక్ లో ఉన్న 2024 సిట్రోన్ C3 బసాల్ట్ కూపే ఎస్‍యూవీఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో కూడిన సిగ్నేచర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను, గ్రిల్ క్రింద మరియు ఎయిర్ డ్యామ్‌పై హారిజాంటల్ స్లాట్‌లతో కూడిన స్క్వేర్డ్ ఇన్సర్ట్స్, బ్లాక్-అవుట్ ఓఆర్‌విఎం, ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్, మరియు C-పిల్లర్‌పై ఆరెంజ్ కలర్ ఇన్సర్ట్‌తో కూడిన ప్లాస్టిక్ ఎక్స్‌టెన్షన్ వంటి వాటిని పొందనుంది.
ఇక కారు వెనుక వైపు పరిశీలిస్తే, C3 బసాల్ట్ ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ బంపర్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ హోల్డర్ మరియు ర్యాక్డ్ విండ్‌షీల్డ్‌ను కలిగి ఉంది. వీటిలో ఉన్న చాలా అంశాలు మార్చి-2024లో వెల్లడించిన కాన్సెప్ట్ వెర్షన్ నుండి తీసుకోబడ్డాయి. వాటినే మనం ఇక్కడ చూస్తున్నాం.
సిట్రోన్ రాబోయే (అప్‍కమింగ్) టాటా కర్వ్ కు పోటీగా ఉండనున్న సిట్రోన్ రాబోయే (అప్‍కమింగ్) బసాల్ట్ కారు ఇంటీరియర్‌ను పరిశీలిస్తే, ఊహించిన విధంగానే త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, హారిజాంటల్ ఏసీ వెంట్స్, మాన్యువల్ హ్యాండ్‌బ్రేక్, మాన్యువల్ ఐఆర్‌విఎం మరియు గ్రే సీట్ అప్హోల్స్టరీ ఉన్నాయి.
ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తక్కువగానే ఉన్నా, C3 బసాల్ట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన 1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే రానుందని మేము భావిస్తున్నాం. ఈ మోటార్ 109bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేస్తుందని అంచనా.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్