- ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం
- C3 ఎయిర్‌క్రాస్ఎస్‌యువి ఆధారంగా రానున్న బసాల్ట్
సిట్రోన్ దాని రాబోయే కూపే ఎస్‌యువి, బసాల్ట్ ని ఇండియాలో లాంచ్ చేసే టైమ్‌లైన్‌తో పాటు ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఫ్రెంచ్ ఆటోమేకర్ 5వ సరికొత్త ప్రోడక్ట్ ని ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లాంచ్ చేయనుంది. దాని అధికారిక లాంచ్ కి ముందే, కూపే ఎస్‌యువి ఇండియాలో అర్థరాత్రి టెస్టింగ్ చేస్తూ కనిపించింది.
C3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా వచ్చిన బసాల్ట్ ఎస్‌యువి పోలి ఉంటుంది, ఇది సిగ్నేచర్ టూ-స్లాట్ గ్రిల్‌తో పాటు సిట్రోన్ లోగోని కలిగి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, బసాల్ట్ లో రేడియేటర్ గ్రిల్‌తో అదేవిధంగా ఉండే ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంది. ఇతర డిజైన్ హైలైట్‌లలో ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్, ర్యాపరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌స్ మరియు నాచ్‌బ్యాక్ వంటి ఎత్తైన టెయిల్‌గేట్ వంటివి ఉన్నాయి.
ఫీచర్ల విషయానికొస్తే, ప్రస్తుత C3 ఎయిర్‌క్రాస్ కంటే బసాల్ట్ ఎక్కువ ఫీచర్లను అందిస్తుంది. ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లతో వచ్చే అవకాశం ఉంది.
పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే, బసాల్ట్ C3 ఎయిర్‌క్రాస్‌లో చూసిన అదే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో కొనసాగుతుంది. ఈ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి 109bhp పవర్ అవుట్‌పుట్ మరియు 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప