- C3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా వస్తున్న మోడల్
- అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ తో పోటీ పడనున్న బసాల్ట్
సిట్రోన్ మొట్టమొదటి కూపే ఎస్‌యువి బసాల్ట్‌ను త్వరలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. అలాగే, ఇది ఆగష్టు 2వ తేదీన లాంచ్ కి సిద్ధంగా ఉండగా, దీనికి ముందుగానే, ఈ మోడల్ న్యూ రెడ్ కలర్ తో డీలర్‌షిప్‌ల వద్ద చేరుకోవడం కనిపించింది.
స్పై చిత్రాలలో కనిపించే కలర్ ని బట్టి చూస్తే, కలర్ పాలెట్‌లో సిట్రోన్ ఇప్పుడు పూర్తిగా సరికొత్త కలర్ ని తీసుకువచ్చింది అని చెప్పవచ్చు ఎందుకంటే, ఈ ఎక్స్‌టీరియర్ కలర్ ఇంతకు ముందు వేరే ఏ మోడల్స్ లో కూడా ఎప్పుడు కనిపించలేదు. మరో వైపు, బసాల్ట్ ఎస్‌యువి, C3 ఎయిర్‌క్రాస్ నుండి స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, డిఆర్ఎల్ఎస్, ఫ్లాప్-స్టైల్ డోర్ హ్యాండిల్స్ మరియు డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో సహా చాలా అంశాలను తీసుకొంటుంది.
అయితే, రివైజ్డ్ గ్రిల్, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్‌స్, కొత్త సెట్ అల్లాయ్ వీల్స్, ట్వీక్ చేయబడిన టెయిల్‌ల్యాంప్స్ మరియు పూర్తిగా రీడిజైన్ చేయబడిన రియర్ క్వార్టర్ ఇలాంటివి ఎన్నో దాని కూపే కి సంబందించిన ప్రత్యేక అంశాలు ఉన్నాయి.
అంతేకాకుండా, ఇటీవలి వచ్చిన టీజర్లలో, అప్ కమింగ్ (రాబోయే)బసాల్ట్ ఎస్‌యువి లో ఉండనున్న కొన్ని ఫీచర్స్ ను ఈ బ్రాండ్ వెల్లడించింది. ఇది ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఆర్మ్‌రెస్ట్ మరియు సైడ్ సపోర్ట్‌తో కూడిన హెడ్‌రెస్ట్‌స్ వంటి ఫీచర్లతో రానుంది.
మెకానికల్‍గా, బసాల్ట్ కూపే ఎస్‌యువిలోని అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జత చేయబడింది. మరోవైపు, ఈ కూపే ఎస్‌యువి ని బుక్ చేసుకోవాలనుకుంటున్న కస్టమర్లు వారి వారి పేర్లతో సెలెక్ట్ చేసిన డీలర్‌షిప్‌ల వద్ద రూ. 25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి, బుక్ చేసుకోవచ్చు. అలాగే లాంచ్ తర్వాత, బసాల్ట్ అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ కూపే ఎస్‌యువికి పోటీగా ఉంటుంది.
మూలం: ఆదిత్య కాంబ్లీ
అనువాదించిన వారు: రాజపుష్ప