- రూ.7.99 లక్షలతో సిట్రోన్ బసాల్ట్ ధరలు ప్రారంభం
- లీటరుకు 19.5 కిలోమీటర్ల మైలేజీ అందిస్తున్న బసాల్ట్
టాటా కర్వ్ కి పోటీగా ఉన్న బసాల్ట్ కూపే ఎస్‍యూవీ ధరలను నేడే సిట్రోన్ ఇండియాప్రకటించగా, వీటి ఎక్స్-షోరూం ధరలు రూ. 7.99 లక్షలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రూ.7.99 లక్షల ఎక్స్‌క్లూజివ్ ప్రారంభ ధర 31 అక్టోబర్ 2024 వరకు బుక్ చేసుకున్న డెలివరీలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఈ కారును బుక్ చేసుకోవాలనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న సిట్రోన్ డీలర్ షిప్స్ వద్ద లేదా బ్రాండ్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రూ.11 వేల బుకింగ్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఎక్స్‌టీరియర్ డిజైన్
కొత్త సిట్రోన్ బసాల్ట్ కారు డిజైన్ ఇతర సిట్రోన్ కార్లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంది. ఈ కారు బయటి వైపు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ట్విన్ స్లాట్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, సర్క్యులర్ ఫాగ్ లైట్స్, బ్లాక్-అవుట్ ఓఆర్‍విఎంస్ మరియు బి-పిల్లర్స్ మరియు ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. అలాగే కారు మధ్య భాగం నుంచి రియర్ ప్రొఫైల్ వరకు స్లోపింగ్ రూఫ్ లైన్ ని కలిగి ఉండగా, కారుపై భాగంలో షార్క్-ఫిన్ యాంటెన్నా అందించబడింది. ఇంకా చెప్పాలంటే, ఇది డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ర్యాప్-అరౌండ్ టెయిల్‌లైట్స్ , మరియు ఆప్షనల్ కాంట్రాస్ట్-కలర్డ్ రూఫ్‌లను కూడా పొందింది.
ఇంటీరియర్ మరియు ఫీచర్లు
ఇంటీరియర్ పరంగా, బసాల్ట్ కూపే ఎస్‍యూవీ లోపల 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెండవ వరుస సీటింగ్ లో 3-స్టెప్ అడ్జస్టబుల్ థై(తొడ) సపోర్ట్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, రియర్ ఏసీవెంట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లతో వచ్చింది. ఇందులో ఉన్న ఫీచర్లన్నీ ఇప్పుడు C3 ఎయిర్‌క్రాస్ మరియు C3 హ్యాచ్‌బ్యాక్ లోని కొన్ని వెర్షన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
పవర్ ట్రెయిన్స్ మరియు స్పెసిఫికేషన్స్
కొత్త బసాల్ట్ కారు బానెట్ కింద, రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి కచ్చింది. మొదటి 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జత చేయబడి 80bhp and 115Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రెండోది 1.2-లీటర్, త్రీ-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు. ఈ ఇంజిన్మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లో 109bhp పవర్ ని జనరేట్ చేస్తుండగా, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్‌మిషన్లో 190Nm మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
మైలేజీ
ఇంజిన్ | గేర్ బాక్సు | మైలేజీ (కి.మీ/లీటర్) |
1.2 ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ | 5-స్పీడ్ మాన్యువల్ | 18కెఎంపిఎల్ |
1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్ | 6-స్పీడ్ మాన్యువల్ ఎంటి | 19.5కెఎంపిఎల్ |
1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్ | 6-స్పీడ్ ఆటోమేటిక్ | 18.7కెఎంపిఎల్ |