కార్‌ట్రేడ్ టెక్ యొక్క సిఎస్ఆర్ విభాగం, కార్‌ట్రేడ్ ఫౌండేషన్, దసరా పండుగ సందర్భంగా తన ఫ్లాగ్‌షిప్ లో మొదటిప్రాధాన్యతగా, 'డ్రైవ్ ఏ స్మైల్'ని లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఇండియా మొబిలిటీ సెక్టార్ లో పాజిటివ్ మరియు శాశ్వత సామాజిక ప్రభావాన్ని సృష్టించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఇండియా లీడింగ్ మల్టీ-ఛానల్ ఆటో ప్లాట్‌ఫారమ్, కార్‌ట్రేడ్ టెక్ ఈ కొత్త ప్రయత్నం ద్వారా ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఆవిష్కరణ మరియు సామాజిక మార్పును తీసుకురావడం కోసం కృషి చేస్తుంది .
డ్రైవ్ ఏ స్మైల్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ ఫారం, ఇది ట్యాక్సీ డ్రైవర్స్, ఫుడ్ డెలివరీ పర్సనల్, ఆటో ప్లాంట్ వర్కర్స్, పెట్రోల్ స్టేషన్ ఎంప్లాయిస్, ఆటోమొబైల్ డీలర్‌షిప్ స్టాఫ్, ఫ్యామిలీస్, కంపాసినేట్ డోనర్స్ మరియు డోనర్ ఆర్గనైజేషన్ తో పాటు మొబిలిటీ ఇండస్ట్రీలో పనిచేసే వ్యక్తులను కనెక్ట్ చేస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ మొబిలిటీ సెక్టార్ లో ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి హెల్ప్ చేయడానికి దాతలకు ఒక సరైన మార్గాన్ని చూపిస్తుంది.
ప్రస్తుతం, ఈప్లాట్‌ఫారమ్‌లో రెండు ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి: ఒకటి కార్ డీలర్ ఎంప్లాయిస్ లకు ఎడ్యుకేషన్, హెల్త్ సపోర్ట్ కాగా మరియు ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఫామిలీస్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్
ఈ సందర్భంగా కార్‌ట్రేడ్ టెక్ చైర్మన్ మరియు ఫౌండర్, వినయ్ సంఘీ మాట్లాడుతూ, 'మా దృష్టిలో, మా ఇండస్ట్రీకి ఆధారమైన కమ్యూనిటీల నుండి మాకు లభించే మద్దతును తిరిగి పొందాలనే నిబద్ధత మరియు బిజినెస్ సక్సెస్ అయ్యేలా మార్గం సుగమం చేసుకోవాలని భావిస్తున్నాము. దీన్ని మా ప్రయాణంలో అంతర్భాగంగా భావిస్తున్నాము. డ్రైవ్ ఏ స్మైల్ ద్వారా మొబిలిటీ మరియు ఆటోమోటివ్ సెక్టార్ లో భాగమైన వ్యక్తులకు, వెరిఫైడ్ దాతలకు మా కార్యకలాపాలను, అనుసంధానించే డిజిటల్ మార్కెట్‌ప్లేస్, మొబిలిటీ సెక్టార్‌లోని అంకితభావంతో పనిచేసే శ్రామిక శక్తికి తిరుగులేని సహాయాన్ని అందించడానికి మరియు అవసరమైన సమయాల్లో వారికి అండగా నిలవడానికి కట్టుబడి ఉంటాము. ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మా దాతృత్వం మరియు సంఘీభావానికి సజీవ నిదర్శనం. మొబిలిటీ సెక్టార్‌లో సానుకూల సామాజిక మార్పును పెంపొందించేందుకు, అదే విధంగా మా నిబద్ధతకు ప్రతీకగా దసరా శుభ సందర్భంగా ‘డ్రైవ్‌ఏ స్మైల్’ ని ప్రారంభించినందుకు మేము ఎంతగానో గర్విస్తున్నాము” అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప